Viral News: బాల్కనీలో దుస్తులు ఆరేస్తే రూ. 20వేల జరిమానా.. ఎక్కడో తెలుసా?

|

May 01, 2022 | 8:30 AM

అధికారులు అపార్ట్‌మెంట్ బాల్కనీలు, కిటికీలు లేదా రెయిలింగ్‌లపై దుస్తులను ఆరబెట్టడాన్ని నిషేధించారు. బాల్కనీలో బట్టలు ఆరేయడం వల్ల నగర అందం దిగజారిపోతోందని అంటున్నారు. ఇలాంటి నిబంధన ఎక్కడ ఉందో తెలుసా?

Viral News: బాల్కనీలో దుస్తులు ఆరేస్తే రూ. 20వేల జరిమానా.. ఎక్కడో తెలుసా?
Drying Clothes On Balconies
Follow us on

ఇదేంటి, బాల్కనీలో దుస్తులు ఆరేస్తే రూ. 21వేల జరిమానా.. ఇదేం పిచ్చి నియమం అని ఆలోచిస్తున్నారా.. అవునండీ. ఇది నిజమే. ఇకపై బాల్కనీలో దుస్తులు ఆరేస్తే భారీగా ఫైన్ పడనుంది. ఈ కొత్త నియమం ఇటీవలే అమల్లోకి వచ్చింది. ఈ నియమం ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం. అదేనండీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో.. ఇలాంటి వింతైన రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ బాల్కనీలో బట్టలు ఆరబెట్టడంపై హెచ్చరికలు జారీ చేసింది. అబుదాబి అధికారులు అపార్ట్‌మెంట్ బాల్కనీలు, కిటికీలు లేదా రెయిలింగ్‌లపై దుస్తులను ఆరబెట్టడాన్ని నిషేధించారు. బాల్కనీలో బట్టలు ఆరేయడం వల్ల నగర అందం దిగజారిపోతోందని అంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు అబుదాబి అందాలను కాపాడుకోవాలని సూచించారు. ఎవరైనా బాల్కనీలో బట్టలు ఆరేస్తూ పట్టుబడితే 1000 దిర్హామ్‌లు (సుమారు రూ. 20,000) జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు నగరంలో అవగాహన ప్రచారం నిర్వహించారు. అబుదాబి మునిసిపల్ కార్పొరేషన్ ఈ ప్రచారం చేపట్టింది. నగరం అందంగా ఉండేలా చూసుకోవడమే లక్ష్యంగా పేర్కొంటుంది. అపార్ట్‌మెంట్ బాల్కనీలో లాండ్రీని ఉంచడం లేదా వాటిని కిటికీకి వేలాడదీయడం లేదా రైలింగ్ భవనం ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ఇకపై వీటికి అనుమతి లేదంటూ కార్పొరేషన్ నుంచి ఒక ప్రకటన చేసింది.

నిబంధనలను పాటించకుంటే జరిమానా..

అబుదాబి నివాసితులు నగర అందాలను కాపాడుకోవాలని, వారి అపార్ట్‌మెంట్ల బాల్కనీలను దుర్వినియోగం చేయవద్దని అధికారులు తెలిపారు. ఎవరైనా బాల్కనీని దుర్వినియోగం చేసినట్లు తేలితే, వారికి 1000 దిర్హామ్‌ల కంటే ఎక్కువ జరిమానా విధించనున్నారు. అబుదాబి మున్సిపల్ కార్పొరేషన్ బట్టలు ఉతకడానికి అత్యాధునిక లాండ్రీ-డ్రైయింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని ప్రజలను కోరింది. ఎలక్ట్రానిక్ బట్టలు డ్రైయర్లు, బట్టలు ఆరబెట్టేందుకు ర్యాక్‌లు ఉపయోగించాలని కోరింది. నేరుగా వీధికి ఎదురుగా ఉన్న బాల్కనీలో బట్టలు ఆరేయవద్దని హెచ్చరించింది.

Also Read: Viral Video: హృదయాలను కదిలిస్తున్న వైరల్ వీడియో.. 20గంటల పాటు ఫ్రిజ్‌లో ఉన్న బాలుడు.!

Kili Paul: సోషల్ మీడియా స్టార్ కిలీ పాల్‌‌పై దుండుగులు కత్తులతో దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. తీవ్రంగా గాయాలు..