ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొన్నిసార్లు శాస్త్రవేత్తలు అద్భుతమైన వాటిని చూస్తారు.. మరికొన్ని చాలా భయంకరమైన దృశ్యాలను చూస్తారు. ఒకొక్కసారి కనిపించే దృశ్యాలు శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు ఎవరికైనా గూస్‌బంప్స్ వచ్చేలా చేస్తాయి. వేల సంవత్సరాల నాటి శవపేటికల గురించి ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. కొంతమంది ఆ శవ పేటికలను తెరవడం అసలు వాటి గురించి వినడం కూడా ఓ శాపంగా భావిస్తారు. ముఖ్యంగా ఈజిప్టులోని శవ పేటికల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు ఓ శవ పేటికను ఓపెన్ చేశారు. 2000 సంవత్సరాల నాటి నల్ల శవ పేటికను మొదట శాస్త్రవేత్తలు దానిని తెరవడానికి మొదట భయపడ్డారు. అయితే దైర్యం చేసి దానిని తెరవగానే.. అందులో ఉన్న దృశ్యాన్ని చూసి అతను షాక్ తిన్నారు.
ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు శవ పేటికను తెరవాలని భావించారు. ఈ నిర్ణయంతో శవ పేటిక తెరిస్తే ఇబ్బంది పడతారంటూ శాపం ఉందని నమ్మకం. ఆ నమ్మకాన్ని పక్కన పెట్టి మరీ శాస్త్రవేత్తలు ముందుకు అడుగు వేశారు. వీరి పరిశోధనలో 2,000 సంవత్సరాల నాటి పెద్ద నల్ల శవపేటికను కనుగొన్నారని LadBible నివేదిస్తుంది. అలెగ్జాండ్రియాలోని సిడి గెబెర్ జిల్లాలో లభించిన ఈ గ్రానైట్ శవపేటిక ఇది. ఇప్పటివరకు ఈజిప్టులో శాస్త్రవేత్తల పరిశోధనలో కనిపించిన అతిపెద్ద శవపేటిక. దీని పొడవు 2.5 మీటర్లు (సుమారు తొమ్మిది అడుగులు).
ఈ శవపేటిక ఈజిప్టు టోలెమిక్ కాలం (క్రీ.పూ. 323-30), అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం, రోమన్ దండయాత్ర మధ్య కాలం నాటిదని నిపుణులు అంచనా వేస్తున్నారు. శవపేటికను చూస్తే అది ఇంతకు ముందెన్నడూ తెరవలేదని అనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. శవపేటికలు తెరిచినప్పుడు ఒక ఆత్మ బయటకు వస్తుందని సాధారణంగా సినిమాల్లో చూపిస్తారు.. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ శవపేటికను తెరిచినప్పుడు.. ఎటువంటి ఆత్మ బయటకు రాలేదు. అయితే అందులో జిగట, బురద వంటి వాటిని చూశారు.
నివేదికల ప్రకారం శవపేటికలో మూడు అస్థిపంజరాలు ఉన్నాయి. పురావస్తు శాస్త్రవేత్త షాబాన్ అబ్దెల్ మోనీమ్ మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఆ అస్థిపంజరాలన్నీ పురుషులకు చెందినవి. అస్థిపంజరం బహుశా ఆర్మీ అధికారి లేదా పూజారిది కావచ్చునని ఆయన అన్నారు. శవపేటిక ఏ రాజు లేదా చక్రవర్తికి చెందినదని వారు చెప్పారు. ఎందుకంటే అందులో శాసనం లేదు. ఈ శవపేటికను, దానిలోని అస్థిపంజరాలను తదుపరి అధ్యయనం కోసం అలెగ్జాండ్రియా నేషనల్ మ్యూజియంకు పంపుతామని, అక్కడ వారి మరణానికి గల కారణాలను పరిశోధిస్తామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..