Viral Video: నడిరోడ్డుపై చేపలు పట్టి, స్నానం చేసిన సామాజిక కార్యకర్త.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..

|

Mar 24, 2021 | 5:44 AM

Viral Video: రహదారి మధ్యలో ఉన్న పెద్ద గుంత అనేక ప్రమాదాలకు కారణం అవడంతో దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి వినూత్న..

Viral Video: నడిరోడ్డుపై చేపలు పట్టి, స్నానం చేసిన సామాజిక కార్యకర్త.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..
Bathing In Path Hole
Follow us on

Viral Video: రహదారి మధ్యలో ఉన్న పెద్ద గుంత అనేక ప్రమాదాలకు కారణం అవడంతో దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. అతను నిరసన తెలిపిన విధానం చూసి అంతా షాక్ అయ్యారు. చివరికి అతని దెబ్బకి అధికారులు దిగివచ్చి రహదారి మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎలా నిరసన తెలిపాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండోనేషియాలోని వస్ట్ నుసా తెంగారా(ఎన్‌టిబి)‌, సెంట్రల్ లోంబాక్ పరిధిలోని ప్రయా సిటీలో రోడ్డు దెబ్బతిన్నది. రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. వర్షం కురవడంతో వాన నీరు రోడ్డుపై ఏర్పడిన గుంతలో నిలిచాయి. దాంతో ఆ గుంతలు కనిపించక అనేక మంది వాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. ఇది గమనించిన ఓహాన్ అనే సామాజిక కార్యకర్త.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. రహదారి మధ్యలో ఉన్న ఒక పెద్ద గుంటలో నీరు ఉండటంతో రోడ్డుపైనే కుర్చీ వేసుకుని ఆ నీటిలో చేపలు పట్టాడు. అంతేకాదు.. ఆ నీటితోనే స్నానం చేశాడు. సబ్బు, షాంపు పెట్టుకుని ప్రెషప్ అయ్యాడు. ఆ గుంటలోనే ఈత కొట్టాడు. దీన్నంతటినీ వీడియో తీసి ఇదీ రోడ్డు పరిస్థితి అంటూ, అక్కడ జరుగుతున్న ప్రమాదాలను వీడియోలో సవివరంగా పేర్కొన్నాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది.

ఆ వీడియో చివరికి అటు తిరిగి, ఇటు తిరిగి సంబంధిత అధికారుల కంట పడింది. వెంటనే స్పందించిన అధికారులు.. త్వరలోనే రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభిస్తాని ప్రకటించారు. కాగా, ప్రయా సిటీ సెంటర్‌లో ఉండే ప్రాంతంలో రోడ్డు గత రెండేళ్ల క్రితమే కొద్దిగా దెబ్బతిన్నదట. అయితే, పెద్దగా నష్టం లేకపోవడంతో జనాలు కూడా లైట్ తీసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు మరింత దెబ్బతినడంతో అనేక మంది ప్రమాదాల బారిన పడ్డారట. దీనిపై అధికారులకు సమాచారం అందించినా ఇదిగో చేస్తున్నాం.. అదిగో చేస్తున్నాంటూ కాలయాపన చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సామాజిక కార్యకర్త ఓహాన్.. తనదైన స్టైల్‌లో నిరసన తెలిపి అధికారులకు షాక్ ఇచ్చాడు. కాగా, ఒహాన్‌కు స్థానిక ప్రజలు కూడా సపోర్ట్‌గా నిలిచారు. అతను రోడ్డుపై ఉన్న మడుగులో చేపలు పడుతుంటే.. స్థానికులు కుర్చీ, గొడుగు ఇచ్చారని ఒహాన్ చెప్పారు. మొత్తంగా రోడ్డు సమస్య పరిష్కారం అవడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒహాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Viral Video:

Also read:

Hero Motocorp: బైక్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటోకార్ప్..

OnePlus 9 Series in India: అదిరిపోయే ఫీచర్లతో భారత్‌లో లాంచ్‌ అయిన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..