టెస్లా కార్.. దీని గురించి వినని కారు ప్రయాణికులు ఉండనే ఉండరు. ఏదోక సమయంలో తప్పక అనుకునే ఉంటారు.. ‘ఆ కారు నా సొంతం అయితే ఎంత బాగుంటుందోన’ని. అయితే ఇప్పుడు టెస్లా కారుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చైనా వీధులలో.. బ్రేకులు ఫెయిలయిన టెస్లా మోడల్ వై కారు వేగంగా దూసుకువెళ్లి.. అదుపుతప్పినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులో నవంబరు 5న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక బైక్ రైడర్, ఓ చిన్నారి చనిపోయారు. చివరికి టెస్లా కారు వెళ్లి మరో భారీ వాహనాన్ని ఢీకోనడంతో ఆగింది.
చైనాలోని అతి పెద్ద మార్కెటింగ్ కంపెనీలలో టెస్లా కూడా ఒకటి కావడంతో.. ఈ ఘటనపై చైనా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఇందులో అమెరికాకు చెందిన ఈవీ మేకర్ కూడా సహకరిస్తోంది. కారు అదుపు తప్పడానికి కారణమేమిటో ఇంకా తెలియలేదని, ఇంటి ముందు ఉన్న షాపు నుంచి కారును తీస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కారులో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై టెల్సా కంపెనీ ‘ కారు వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ లైట్లు పనిచేయవు. ఇంకా కారును ఆపేందుకు బ్రేక్ మీద కాలు వేసినట్లు డాటాలో కనిపించడంలేద’ని తెలిపింది.
Crazy @Tesla video from a week ago. Just saw it on Reddit.
Driver was trying to park the car and then things went awry.
Parking button didn’t work.
Breaks didn’t work.
It just kept on accelerating.
Two people including a high school girl dead. pic.twitter.com/GTwVs7QOg6
— Ravi Handa (@ravihanda) November 13, 2022
కాగా, టెల్సా కారులో బ్రేకింగ్ సమస్యలు ఉన్నట్లు అనేక సందర్భాలలో తేలింది. గత ఏడాది షాంఘైకు చెందిన ఓ వ్యక్తి.. తన టెస్లా కారుకు బ్రేకులు సరిగా పనిచేయకపోవడంతో ప్రమాదానికి గురయ్యానని, దీనిపై టెస్లా కంపెనీ ఎలాంటి చర్య తీసుకోవడంలేదని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి