అంగారకుడిపైకి నాసా ‘పర్సేవరెన్స్’ రోవర్ ని విజయవంతంగా దింపడంలో కీలక పాత్ర వహించిన ఇండియన్ అమెరికన్ ఏరో స్పేస్ ఇంజనీర్ డా.స్వాతి మోహన్ ని అధ్యక్షుడు జోబైడెన్ అద్భుతంగా ప్రశంసించారు. మీ ఇండో-అమెరికన్ల కృషి అమోఘమన్నారు. కాగా-తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు స్టార్ ట్రెక్ ఫస్ట్ ఎపిసోడ్ చూశానని, అప్పటి నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి చూపుతూ వచ్చానని స్వాతి మోహన్ తెలిపారు. (ఈమె ఏడాది వయసులో ఉండగా ఈమె కుటుంబం ఇండియా నుంచి అమెరికా చేరుకుంది). జోబైడెన్ తో వర్చ్యువల్ గా సమావేశమైన స్వాతి మోహన్…పర్సేవరెన్స్ రోవర్ ని అరుణ గ్రహంపై దింపాలని ఇతర ఇంజనీర్లతో కలిసి తాను కూడా ఎన్నో కలలు కన్నానని, అవి నిజమయ్యాయని అన్నారు. ముఖ్యంగా చివరి ఏడు నిముషాలు ఎంతో నెర్వస్ గా ఫీలయ్యాయన్నారు. నేను కలలో ఉన్నట్టు అనుభూతి చెందుతున్నాను అని ఆమె పేర్కొన్నారు. నాసా టీమ్ తో మాట్లాడినందుకు ఆమె జోబైడెన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇది నేను ఊహించలేదన్నారు.
అటు-జోబైడెన్.. మీరు నన్ను చిన్న పిల్లాడనుకుంటున్నారా అని చమత్కరించారు. ఇది ఎంతో గొప్ప గౌరవమని, ఇండియన్ ఆఫ్ డీసెంట్ అని ఆయన అభివర్ణించారు. అమెరికన్లు దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుండగా..మీరు (స్వాతి మోహన్), ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, తన స్పీచ్ రైటర్ వినయ్ (రెడ్డి) వంటివారు కూడా తన టీమ్ లో ఉన్నందుకు గర్విస్తున్నానని ఆయన చెప్పారు. ‘యూ గైస్ ఆర్ ఇన్ క్రెడిబుల్’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా నాసా వారి రోవర్ అరుణ గ్రహంపై విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ చేసి నాసా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. 33 నిముషాల సమయంలో 21.3 అడుగుల దూరం ప్రయాణించింది. ఇందుకు సంబంధించి రోవర్ పంపిన ఇమేజీల్లో..ఇది ప్రయాణించిన ట్రాక్ జాడలు స్పష్టంగా కనిపించాయి. ఈ మిషన్ లో ఇది కీలక ఘట్టమని పర్సోవెరెన్సీ మొబిలిటీ టెస్ట్ బెడ్ ఇంజనీర్ అనైస్ జరిఫాన్ అన్నారు. మరి కొన్ని రోజుల్లో రోవర్ తో కొన్ని దూర ప్రయాణాలు చేయించనున్నామన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :