ట్రంప్‌ దూకుడుతో మళ్లీ దడదడ.. వెనిజులా తర్వాత మీ వంతే అంటున్న ట్రంప్‌..

వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు.. అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంతటి ఆగకుండా ఇప్పుడు మిగిలిన ప్రత్యర్థి దేశాలకు కూడా డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా లాటిన్‌ అమెరికా దేశాలైన క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడం మరింత హీట్‌ పెంచుతోంది.

ట్రంప్‌ దూకుడుతో మళ్లీ దడదడ.. వెనిజులా తర్వాత మీ వంతే అంటున్న ట్రంప్‌..
Trump Threatens Colombia And Mexico

Updated on: Jan 04, 2026 | 5:07 PM

వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు.. అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంతటి ఆగకుండా ఇప్పుడు మిగిలిన ప్రత్యర్థి దేశాలకు కూడా డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా లాటిన్‌ అమెరికా దేశాలైన క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడం మరింత హీట్‌ పెంచుతోంది.

మెక్సికో, క్యూబా, కొలంబియా డ్రగ్స్‌ను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. అంతేకాదు.. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా.. పద్ధతి మార్చుకోకపోతే.. తర్వాత.. వెనిజులా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంలో భాగంగా.. ఆయా దేశాల్లోని డ్రగ్స్‌ ఉత్పత్తి ల్యాబ్స్‌పైనా దాడులు చేయడం గ్యారెంటీ అని ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సైతం డొనాల్డ్ ట్రంప్‌ రేంజ్‌లో రియాక్ట్‌ అయ్యారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను కట్టడి చేయడమే అంతిమ లక్ష్యమన్నారు. ఈ విషయంలో వెనిజులా తర్వాత క్యూబా, కొలంబియా వంటి దేశాలపైనా ఫోకస్‌ పెట్టే అవకాశం ఉందని జేడీ వాన్స్‌ చెప్పడం ఆసక్తిగా మారింది.

ఇంతలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను బహిరంగంగా బెదిరించారు. ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, “అతను కొకైన్ తయారు చేసి అమెరికాకు పంపుతున్నాడు, కాబట్టి అతను జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. తన సన్నిహిత మిత్రదేశాలలో ఒకరైన మదురో పేరు చెప్పకుండానే, పెట్రో వాషింగ్టన్ చర్యను లాటిన్ అమెరికా “సార్వభౌమాధికారంపై దాడి” అని అభివర్ణించారు. అయితే ఇది మానవతా సంక్షోభానికి దారితీస్తుందని కొలంబియా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.

కరేబియన్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఓడలను ఎదుర్కోవడానికి ట్రంప్ సైనిక మోహరింపును గుస్తావో పెట్రో తీవ్రంగా విమర్శించారు. తన మాదకద్రవ్యాల వ్యతిరేక వ్యూహంలో భాగంగా కొలంబియాలోని మాదకద్రవ్యాల ఉత్పత్తి ప్రయోగశాలలపై దాడి చేయడాన్ని తాను తోసిపుచ్చబోనని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి ఈ ప్రకటనను దండయాత్ర ముప్పుగా పెట్రో ఖండించారు.

ఇదిలావుంటే, అమెరికా తదుపరి లక్ష్యం క్యూబా కావచ్చునని యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సూచనప్రాయంగా చెప్పారు. వెనిజులా, క్యూబా రెండింటి గురించి చాలా కాలంగా ఆందోళన చెందుతున్న రూబియో, “నేను హవానాలో నివసిస్తూ ప్రభుత్వంలో ఉంటే, కనీసం కొంచెం అయినా ఆందోళన చెందుతాను” అని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..