10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సహాయం కోరుతూ ఓ కాగితంపై మెసేజ్ రాసి బాటిల్‌ను సముద్రంలోకి విసిరాడు. దానికి సమాదానం దాదాపు 37 ఏళ్ల తర్వాత వస్తుందని బహుశా అతను ఊహించి ఉండడు. యునైటెడ్ స్టేట్స్‌లోని మౌంట్ వాషింగ్టన్‌కు చెందిన ట్రాయ్ హెల్లర్ సహాయం కోరుతూ 1985లో కాగితంపై మెసేజ్ రాసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరాడు. ఇన్నాళ్లకు ఫ్లోరిడాలో సముద్రం ఒడ్డున ఓ ఫ్యామిలీకి దొరికింది. ట్రాయ్ హెల్లర్ అనే వ్యక్తి తన అడ్రస్, ఫోన్ నంబర్‌ను తెలియజేస్తూ పంపిన సందేశం కేటీ, అన్నీ కార్మాక్స్ దంపతులకు దొరికింది.
అనంతరం బాటిల్‌లోపలి పేపర్ చదివి సోషల్ మీడియా సహాయంతో సదరు వ్యక్తిని గుర్తించగలిగారు. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన ఫోన్ మెసేజ్ చూసిన హెల్లర్ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను పంపిన మెసేజ్ ఇన్ని సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉండటం, పైగా దానికి సమాధానం పొందుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని మీడియాకు తెలియజేశాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.