Breaking News: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్…

|

Nov 07, 2020 | 11:06 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అపూర్వ విజయాన్ని అందుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి డొనాల్డ్ ట్రంప్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ..

Breaking News: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్...
Follow us on

US Elections 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అపూర్వ విజయాన్ని అందుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి డొనాల్డ్ ట్రంప్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్‌ ఓట్లతో బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని అధిగమించాడు. ఈ ఎన్నికల్లో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 ఎలక్టోరల్‌ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయంలో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అలాగే అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారీస్‌ సేవలందించనున్నారు.

తనను గెలిపించిన అమెరికా ప్రజలకు జో బైడెన్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఓటేసినా, వేయకున్నా.. అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. అమెరికా ముందు అనేక సవాళ్లు ఉన్నాయని బైడెన్ చెప్పుకొచ్చారు.

Also Read:

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ