సునామీని తలపిస్తోన్న తాబేళ్ల సమూహం.. ఒకేసారి లక్షల సంఖ్యలో తాబేళ్ల పరుగులు. వైరల్‌గా మారిన వీడియో.

|

Dec 19, 2020 | 6:19 PM

సాధారణంగా మనకు ఒకటి రెండు తాబేళ్లు కనిపిస్తేనే ఆశ్చర్యంగా చూస్తాము. వాటిని కెమెరాలో బంధించడానికి స్మార్ట్ ఫోన్లను బయటకు తీస్తాము. అలాంటిది ఒకేసారి ఏకంగా లక్షల సంఖ్యలో తాబేళ్లు దండయాత్రగా వస్తుంటే... ఊహించుకోవడానినే అద్భుతంగా ఉంది కదూ. అయితే ఇలాంటి ఓ సంఘటన నిజంగానే జరిగింది.

సునామీని తలపిస్తోన్న తాబేళ్ల సమూహం.. ఒకేసారి లక్షల సంఖ్యలో తాబేళ్ల పరుగులు. వైరల్‌గా మారిన వీడియో.
Follow us on

Turtle tsunami: సాధారణంగా మనకు ఒకటి రెండు తాబేళ్లు కనిపిస్తేనే ఆశ్చర్యంగా చూస్తాము. వాటిని కెమెరాలో బంధించడానికి స్మార్ట్ ఫోన్లను బయటకు తీస్తాము. అలాంటిది ఒకేసారి ఏకంగా లక్షల సంఖ్యలో తాబేళ్లు దండయాత్రగా వస్తుంటే… ఊహించుకోవడానినే అద్భుతంగా ఉంది కదూ. అయితే ఇలాంటి ఓ సంఘటన నిజంగానే జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


బ్రెజిల్‌లో పురస్ అనే నది ఒకటి ఉంది. ఇది అమేజాన్ నదికి ఉపనది. తాజాగా ఈ నది వెంట రక్షిత ప్రాంతంలో భారీ సంఖ్యలో తాబేళ్లు పొదిగాయి. ఒక్క రోజులోనే సుమారు 70 వేలకుపైగా తాబేళ్లు పిల్లలు జన్మించాయి. కొన్ని రోజులకే మరో 20000 వేలకుపైగా తాబేళ్లు పుట్టుకొచ్చాయి. ఇలా వచ్చిన దాదాపు లక్ష తాబేళు పిల్లలు ఒకేసారి ఇసుకలో పరుగులు పెడుతుండడం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (డబ్ల్యుఎస్‌సీ).. ట్విట్టర్ వేదికగా ప్రపంచంతో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.