Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!

శుక్రవారం సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై సుంకాన్ని 10 శాతం నుండి 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించాడు.ఈ సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నాడు.

Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!
Donald Trump (1)

Updated on: Feb 21, 2026 | 10:37 PM

ప్రపంచదేశాలపై ఎడాపెడా పెంచిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు సింగిల్ స్ట్రోక్‌తో రద్దు చేసిన తర్వాత ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిచ్చి తీర్పులిచ్చారంటూ జడ్జిల్నే దేడ్ దిమాక్‌లని తిట్టిపోశారు. అంతేకాదు, పాత సుంకాల లెక్క అటకెక్కేసరికి, ప్లాన్‌-B అంటూ యూనిఫామ్‌గా 10శాతం గ్లోబల్‌ టారిఫ్‌ను ప్రకటించేశారు. ఇదంతా శుక్రవారం మాట. ఇక ఇదే అంశంపై శనివారం ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. నిన్న 10 శాంతం అంటూ ప్రకటించిన సుంకాల శాతాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు తాజాగా మరోసారి ప్రకటించారు.

ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌ ప్రకరాం.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి చాలా క్షుణ్నంగా, ఆలోచించిన తర్వాతే ఈ సుంకాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు. అంతే కాదు ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చట్టబద్ధమైన టారిఫ్‌లను కూడా జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే ఇంతకుముందు తీసుకున్న దానికంటే ఈ సారి ఎక్కువ సుంకాలు విధించేందుకు సాధ్యమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపాడు. అందులో బాగంగానే ఇప్పుడు సుంకాలను 10 నుంచి 15శాతానికి పెంచుతున్నట్లు తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చాడు.

Donald Trump

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us