
రచ్చగెలవడం మీదే ఫోకస్ పెట్టి ఇంట గెలవాలన్న సోయే లేకుండా పోయినట్టుంది అమెరికా అధ్యక్షులవారికి. యుద్ధాల మీద యుద్ధాలు చేసి, కొన్ని యుద్ధాలను ఆపినట్టు కలరింగ్ ఇచ్చిఇచ్చీ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం లాబీయింగ్ ఆడిఆడి అలసిసొలసిపోయిన ట్రంప్సారుకి ఇంట్లో కూడా ఈగల మోత మొదలైంది. కందిరీగల్లా కరిచేస్తున్నారు డెమొక్రాట్లు. అవును, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ప్రెసిడెంట్‌గారికి పిచ్చెక్కించేస్తున్నాయి. రిపబ్లికన్ల వరుస ఓటములు ఆయన్ను దిక్కుతోచని స్థితిలోకి తోసేస్తున్నాయి. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, చేతిలో రాయిని ఎటువైపు విసురుతాడో తెలీక ప్రపంచం అంతటా అదోరకం పరేషాన్లు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అమెరికాలోనే కాదు.. ప్రపంచం మొత్తానికీ హాట్ ఫేవరిట్‌గా మారాయి. ప్రెసిడెంట్ పాలనకు రిఫరెండం లాంటిది గనుక అంతోటి ప్రతిష్టాత్మకంగా మారింది అమెరికాలో మిడ్‌టర్మ్ ఫలితం. ట్రంప్ మీద భయంతోనో భక్తితోనో అమెరికా మధ్యంతర ఎన్నికలకు ఫండింగ్ ఇవ్వడానికి ఈసారి క్యూలోకొచ్చి నిలబడ్డాయి అక్కడి కార్పొరేట్ కంపెనీలు. ఇలా విరాళాలు ఇచ్చినవాళ్లలో మహా బిలియనీర్ ఎలాన్ మస్క్‌దే ఫస్ట్ ప్లేస్. బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థుల కోసం 500 మిలియన్ డాలర్ల దాకా కుమ్మరించారు. టెక్సాస్ సెనేట్ రేసులో నిలబడ్డ తన జిగ్రీ దోస్త్ కెన్ ప్యాక్స్టన్ మీదైతే 100 మిలియన్ డాలర్లు, మన రూపాయల్లో అయితే...