AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం… ఫైజర్ వ్యాక్సిన్ గురించి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికాలో కరోనా అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్‏ను అనుమతిస్తూ ఎఫ్‏డీఏ చేసిన ప్రకటనకు.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం... ఫైజర్ వ్యాక్సిన్ గురించి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2020 | 1:27 PM

Share

అమెరికాలో కరోనా అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్‏ను అనుమతిస్తూ ఎఫ్‏డీఏ చేసిన ప్రకటనకు.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 24 గంటల్లోపు మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభించనున్నామని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం ఓ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ.. “ఫెడ్ఎక్స్, యూపీఎస్‏తో మాకున్న భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దేశంలో ప్రతి రాష్ట్రానికి రవాణాను ప్రారంభించాం. పలు రాష్ట్రాల్లో ఎవరెవరికి ఈ టీకా మొదటి డోసును అందించాలో గవర్నర్లు నిర్ణయిస్తారు. ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న వృద్ధులు, వైద్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్‏ను వేయాలని మేం అనుకుంటున్నాం. ఈ టీకా మరణాల సంఖ్యను, అటు కొత్తగా ఆసుపత్రులలో చేరే వారి సంఖ్యను తగ్గిస్తుంది” అని ట్రంప్ తెలిపారు.

కాగా అటు యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఫైజర్ టీకాకు ఎఫ్‏డీఏ అనుమతించడంతో కరోనాకు స్వస్తీ పలికే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ముందుగా ఈ వ్యాక్సిన్‏ను వైద్య, ఆరోగ్య, మిలిటరీ సిబ్బందితోపాటు వృద్ధులకు అందించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి అమెరికాకు పైజర్ టీకా 100 మిలియన్ డోసుల్ని అందించాల్సి ఉంది. ఇప్పటికే అమెరికాలోని ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్‏ను ఉచితంగానే పంపిణీ చేయనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Follow Us
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
స్టార్ కపుల్ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్
స్టార్ కపుల్ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్
లివర్, గట్ క్లియర్ కాకుండా సప్లిమెంట్స్ వాడితే ముప్పే
లివర్, గట్ క్లియర్ కాకుండా సప్లిమెంట్స్ వాడితే ముప్పే
వేసవిలో షవర్ బాత్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకుంటే డేంజరే
వేసవిలో షవర్ బాత్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకుంటే డేంజరే
ముందస్తు మరణాలు తగ్గించే మ్యాజిక్ గురించి తెలుసా
ముందస్తు మరణాలు తగ్గించే మ్యాజిక్ గురించి తెలుసా
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో గుండె, కిడ్నీలు సేఫ్‌
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో గుండె, కిడ్నీలు సేఫ్‌
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం.. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయోచ్చు
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం.. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయోచ్చు
కేన్స్ నుండి మెట్ గాలా వరకు ‘ఓణీ’ హంగామా
కేన్స్ నుండి మెట్ గాలా వరకు ‘ఓణీ’ హంగామా
ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
ఎన్టీఆర్-నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్ ఏంటంటే?
ఎన్టీఆర్-నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్ ఏంటంటే?