ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న ఎన్నారైలు

మొన్నామధ్య మా అనుమతి తీసుకున్న తర్వాతే రష్యానుంచి చమురు కొనండి.. అని అమెరికా షరతులు పెట్టినప్పుడు ఇండియాకు పెద్ద తలవొంపులే వచ్చాయి. ఒకవైపు మోదీ నాకు జిగ్రీ దోస్త్ అని చెబుతూనే, మరో చేత్తో పెత్తనం చేస్తూనే ఉన్నారు ట్రంప్. లేటెస్ట్‌గా ఒక స్వీపింగ్ రిమార్క్ చేసి, ఇండియాను తలెత్తుకోలేనంతగా కించపరిచారు. ఎందుకు? అమెరికాకు ఇండియా ఒక పరాయి దేశం మాత్రమే కాదు, రైజింగ్ గ్లోబల్ పవర్, ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామి కూడా. అటువంటప్పుడు ట్రంప్ మళ్లీ నోరు పెద్దది చేసుకున్నారు. ట్రంప్ వెర్రిచేష్ట వెనుక అంతరార్థం ఏంటో తెలుసుకుందాం..

ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న ఎన్నారైలు
85

Updated on: Apr 24, 2026 | 9:56 PM

అది 2020 ఫిబ్రవరి ఆఖరివారం. ఏడవ అమెరికన్ సిట్టింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా ఇండియాకొచ్చి రాచ మర్యాదలు అందుకున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజ్‌మహల్‌ను చూసి వావ్ అని నోరెళ్లబెట్టారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ మోతేరా క్రికెట్ స్టేడియంలో లక్షలాదిమంది ఇండియన్స్‌తో జేజేలు కొట్టించుకుని ఫిదా అయ్యారు. ఐలవ్ ఇండియా అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ‘ట్రంప్ 36 అవర్స్ ఇన్ ఇండియా’ అని వాషింగ్టన్‌పోస్ట్ సగర్వంగా సచిత్ర కథనాలు రాసుకుంది. తీరా వైట్‌హౌస్ చేరుకున్నారోలేదో వెంటనే ఓ స్టేట్‌మెంట్..! ‘ఇండియా నన్ను సరిగా ట్రీట్‌ చెయ్యలేదు, కానీ, ఆ దేశ ప్రధాని అంటే ఎంతో ఇష్టం’ అని. వంకరమాటలతో తింగరి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ట్రంప్‌కు అలవాటేనని, తిడతారో పొగుడుతారో ఆయనకే తెలీదని ప్రపంచమంతా మరోసారి నవ్వుకుంది. ఆ తర్వాత, సెకండ్ టర్మ్‌లో కూడా ట్రంప్ నోటిదురుసుని, సిట్యువేషన్‌ డిమాండ్ చేసినా చెయ్యకపోయినా, ఇండియా మీద అక్కసు వెళ్లగక్కడాల్నీ చూస్తూనే ఉన్నాం. దానికి పరాకాష్ట ఏంటంటే… నిన్న హెల్‌హోల్ అంటూ హమారా భారత్‌ను తక్కువచేసి మాట్లాడ్డం. చైనాతో కలిపి నరకకూపం అని పేట్రేగడం.”వీళ్లు ల్యాప్‌టాప్‌లు పట్టుకుని తిరిగే గుండాలు. మనల్ని దోచుకున్నారు, మన జెండాను అవమానించారు. మనల్ని సెకండ్‌ క్లాస్ సిటిజన్లుగా మార్చేశారు, మూడో ప్రపంచ దేశాలకు మనం తేలికైపోయామంటే వీళ్లే కారకులు. మాఫియా గ్యాంగ్‌ల కంటే వీళ్లతోనే మన దేశానికి ఎక్కువ నష్టం.” అని ట్రంప్ అన్నారు. ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి