Tiktok Couple: ప్రకృతిని ప్రేమించే వాళ్ల గురించి తెలుసు. కానీ, ప్రకృతిలో మమేకమైపోయే వ్యక్తుల గురించి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ, ఈ జంటను చూస్తే.. ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్లు గత కొద్ది రోజులుగా అడవుల్లో హాయిగా జీవితం గడుపుతున్నారు. అడవిలో ఓ టెంట్ వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ వీళ్లేవరూ.. ఎక్కడివారో ఇప్పుడు తెలుసుకుందాం..
కెనడాకు చెందిన ఎమిలీ.. తన బాయ్‌ఫ్రెండ్, రెండు కుక్కలతో కలిసి అడవిలోకి వెళ్లింది. అక్కడ టెంట్ వేసుకుని హాయిగా నివసిస్తోంది. కెనడాలోని ఓ అడవిలో టెంట్ వేసుకొని తన బాయ్‌ఫ్రెండ్, రెండు కుక్కలతో హాయిగా నివసిస్తోంది. ఇకపోతే, ఆ టెంట్‌లోపల… ఆర్‌వీ పరుపుతో చేసిన బెడ్ కూడా ఉంది. కానీ, రాత్రివేళ వీళ్లు చెట్ల కొమ్మలపై కట్టుకున్న బెడ్‌పై పడుకుంటారు. రాత్రివేళ టెంట్‌లో బెడ్ కంటే… చెట్లపై బెడ్డే సేఫ్టీ అంటున్నారు. టెంట్‌లో ఓ భారీ అద్దం, ఓ కుర్చీ, ఓ టేబుల్ కూడా ఉన్నాయి. మరోవైపు బట్టలు పెట్టుకోవటానికి సెట్ చేసుకున్నారు. టెంట్ లోపల ఓ ఫ్లోర్ ఏర్పాటు చేసి.. అందులో ఆహారాన్ని స్టోర్ చేసుకున్నారు. బకెట్‌ని టాయిలెట్‌లా వాడుతున్నారు. స్నానం కోసం సోలార్ పవర్‌తో పనిచేసే షవర్ బ్యాగ్ ఉంది. పైగా వీళ్లకు ఓ కారు కూడా ఉంది. అందులో మొబైల్స్ ఛార్జ్ చేసుకుంటున్నారు. ఇక వీళ్లు ఈ టెంట్‌లో ఉండే, రోజులో తక్కువ సమయం మాత్రమే..ఎక్కువ టైమ్ అడవిలోనే గడుపుతారు.
ఇకపోతే, ఎమిలీకి Etsy షాప్ ఉంది. అందులో పౌచ్‌లు తయారుచేసి అమ్ముతుంది. అలా కావాల్సిన మనీ సంపాదిస్తోంది. పైగా వీళ్లు ఈ అడవిలో ఉంటుంన్నందుకు…ఆ అడవి యజమానులకు 33వేల రూపాయలు కిరాయి కూడా చెల్లిస్తున్నారు. ఇందుకుగానూ వారికి 5 ఎకరాల అడవిని ఇచ్చారు. అక్కడ ఈ జంట మొక్కలు పెంచుతోంది. కాకపోతే, వీళ్ల లైఫ్‌స్టైల్ చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. జంతువులు, కృరమృగాల మధ్య జాగ్రత్త అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.
Also read: