Corona Virus: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆ నగరాల్లో బస్సులు, రైళ్లు నిలిపివేత

| Edited By: Janardhan Veluru

Sep 12, 2021 | 10:20 PM

Corona Virus in China: చైనాలో వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా వణికిస్తూనే ఉంది. ఓ వైపు అన్ని దేశాలు కరోనా కట్టడికోసం నివారణ చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం..

Corona Virus: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆ నగరాల్లో బస్సులు, రైళ్లు నిలిపివేత
China Corona
Follow us on

Corona Virus in China: చైనాలో వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా వణికిస్తూనే ఉంది. ఓ వైపు అన్ని దేశాలు కరోనా కట్టడికోసం నివారణ చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరిపిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుని.. రకరకాల వేరియెంట్స్ గా మారి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే తాము కరోనాని కట్టడి చేశామని గత ఏడాది జనవరి లో ప్రకటించిన కరోనా పుట్టినిల్లు డ్రాగన్ కంట్రీ లో మళ్లీ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చైనాలో కోవిడ్ నయా రూపం డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. దీంతో అక్కడ వివిధ నగరాలు వణికిపోతున్నాయి. అంతేకాదు కరోనా కట్టడి కోసం మళ్ళీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ చైనా.. ఫుజియాన్​ రాష్ట్రంలోని పుతియాన్​ నగరంలో కరోనా వైరస్ మళ్ళీ ఓ రేంజ్ లో విజృంభిస్తుంది. గత 24గంటల్లో అక్కడ కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో పుతియాన్​లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్లు చైనా ఎన్​హెచ్​సీ తెలిపింది. నగరంలోని ప్రజలు .. నగరం దాటి వెళ్లవద్దంటూ ఆంక్షలు పెట్టారు. అంతేకాదు పుతియాన్ లోని బస్సు, రైలు సేవలను నిలిపివేశారు. అయితే అత్యవసరంగా నగరం దాటి వెళ్లేవారు.. తప్పనిసరిగా 48 గంటల ముందు కొవిడ్​ నెగెటివ్​గా సర్టిఫికెట్ చూపించాలని అధికారులు స్పష్టం చేశారు.

అంతేకాదు నగరంలోని సినిమా హాళ్లు, పేకాట స్థలాలు, జిమ్​లు, పర్యటక ప్రదేశాలతో పాటు జనం ఎక్కువగా ఉండే అన్ని రకాల ప్రదేశాలను అధికారులు క్లోజ్ చేశారు. రెస్టారెంట్లు, సూపర్​ మార్కెట్లకు మినహాయింపు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు ఫుజియాన్ తో పాటు క్వాన్​జోవులో కూడా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Also Read:   నా కోడిని ఎవరో చంపేశారు.. కేసు పెట్టి, పోస్టు మార్టం చేయమని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు..

: శివుడికి ప్రతిరూపం ఈ కొబ్బరికాయ అంటూ.. రూ.6.50 లక్షలకు కొన్న భక్తుడు.. ఎక్కడంటే..