“రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి”.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు.

రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!
Advisory For Indians

Updated on: Apr 07, 2026 | 8:23 PM

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

తాజాగా ఇరాన్‌లోని అత్యంత ముఖ్యమైన చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపంపై వరుస దాడులు జరిగాయి. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఇరాన్‌కు గడువు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువుకు కొద్ది క్షణాల ముందు ఈ దాడి జరిగింది. మరోవైపు ఇరాన్‌కు ఇచ్చిన గడువులోగా టెహ్రాన్‌ను నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. సోషల్ ట్రూత్ అనే వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో, మంగళవారం రాత్రి (ఏప్రిల్ 7, 2026) ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడం ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. తాను ఇలా చేయాలని కోరుకోలేదని, కానీ అలా చేయక తప్పడం లేదని ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు.

ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది. రాబోయే 48 గంటల పాటు భారత పౌరులు ఉన్నచోటనే ఉండాలని కోరింది. ‘భారత రాయబార కార్యాలయం బుక్ చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు లోపలే ఉండాలి. అక్కడ ఉన్న రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలి’ అని ఆ సలహాలో పేర్కొన్నారు.

The Embassy Of India In Iran Advisory

ఇదిలా ఉండగా, ఇరాన్ అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష చర్చల మార్గాలను నిలిపివేసిందని టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. అన్ని రకాల సందేశాల మార్పిడిని కూడా నిలిపివేసిందని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. నెల రోజులుగా సాగతున్న ఘర్షణలో, అమెరికా, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక లక్ష్యాలను నేలమట్టం చేశాయి. ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని హతమార్చాయి. దేశ మౌలిక సదుపాయాలలోని కొన్ని భాగాలను ధ్వంసం చేశాయి. ఇందుకు ధీటుగా ఇరాన్ సైతం సమాధానం ఇస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us