సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 21మంది సైనికులు మృతి

| Edited By:

Mar 18, 2019 | 9:34 AM

మాలిలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై ఆదివారం దాడులు చేశారు. బైక్‌లు, కార్లలో వచ్చిన దుండగులు దియౌకాలొరి ఆర్మీ క్యాంపుపై కాల్పులకు దిగబడ్డారు. ఈ దాడిలో 21మంది సైనికులు చనిపోయినట్లు అక్కడి సైనిక వర్గాలు తెలిపాయి. ఓ మాజీ సైనికాధికారి నేతృత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే ఈ దాడికి తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో దేశ ప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్ కీట […]

సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 21మంది సైనికులు మృతి
Follow us on

మాలిలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై ఆదివారం దాడులు చేశారు. బైక్‌లు, కార్లలో వచ్చిన దుండగులు దియౌకాలొరి ఆర్మీ క్యాంపుపై కాల్పులకు దిగబడ్డారు. ఈ దాడిలో 21మంది సైనికులు చనిపోయినట్లు అక్కడి సైనిక వర్గాలు తెలిపాయి. ఓ మాజీ సైనికాధికారి నేతృత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే ఈ దాడికి తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో దేశ ప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్ కీట పిలుపునిచ్చారు.

కాగా గత కొన్ని సంవత్సరాలుగా మాలిలో ఐసిస్ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. 2012లో ఈ ముఠా ఉత్తర ప్రాంతంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే 2013లో ఫ్రెంచ్ బలగాలు వారిని తరిమికొట్టాయి. అనంతరం ఐరాస అక్కడ శాంతి పరిరక్షణ దళాలు మొహరించాయి. ఫ్రెంచ్ భద్రతా బలగాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2015లో మాలి ప్రభుత్వానికి తీవ్రవాద ముఠాలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటకీ హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు.