రష్యాకు చెందిన తత్యానా ఓజోలినాకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. తన రైడింగ్ సాహసాలతో సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఎన్నో సాహసోపేతమైన రైడ్‌లు చేసి పాపులర్ అయ్యి.. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది తత్యానా. ఇలా ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.. దాదాపు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఆమె.. తక్కువ వయస్సులోనే ప్రాణాలను పొగొట్టుకుంది. తనకెంతో ఇష్టమైన బైక్ నడుపుతూ టర్కీలో దురదృష్టశాత్తు ప్రమాదానికి గురై తత్యానా ఓజోలినా ప్రాణాలు కోల్పోయారు. మిలాన్ సమీపంలో బైక్ రైడ్ చేస్తుండగా.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టిందామె. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతిచెందగా.. వెనుక కూర్చున్న మరో బైకర్ తీవ్రంగా గాయపడ్డారు.
38ఏళ్ల ఓజోలినా ‘మోటోతాన్యా’ పేరుతో బైక్ రైడింగ్‌పై వ్లాగ్‌లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యారు. ఆమె ఖాతాలకు ఇన్‌స్టాలో 10లక్షల మంది, యూట్యూబ్‌లో 20లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసే రైడ్ లను ఎప్పటికప్పుడు పంచుకుంటూ.. ఓజోలినా అందరినీ ఆకట్టుకుంటుంది..
ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన రైడింగ్‌లు చేసే ఈ ఇన్‌ప్లుయెన్సర్‌ను ‘రష్యా మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్‌గా అభిమానులు పిలుచుకుంటారు. ఈమెకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె మృతి చెందడంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మిలాస్-సోక్ హైవేపై తన ఎరుపు రంగు బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్‌ను నడుపుతుండగా ఓజోలినా ట్రక్కును ఢీకొట్టిందని టర్కీ మీడియా సంస్థ టర్కీయే టుడే నివేదించింది. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులు వచ్చినప్పటికీ.. ఆమె అప్పటికే మృతి చెందిందని పేర్కొంది.
జూలై 18న తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఓజోలినా యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..