Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రం కావడంతో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కోతలు, పెరుగుతున్న ధరలతో లంకేయులు రాజపక్స ప్రభుత్వంపై తిరుబాటు చేశారు. ఈ క్రమంలో శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఈ ఘటనల్లో ఓ ఎంపీ చనిపోవడంతోపాటు.. ప్రధాని, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పుపెట్టారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత.. నిరసనలు చాలా శాంతియుతంగానే కొనసాగినప్పటికీ.. ఏప్రిల్ 19న పోలీసులు ఒక నిరసనకారుడిని కాల్చి చంపడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. వేలాది మంది అరెస్టులు, కర్ఫ్యూలు విధించారు.
ఈ క్రమంలో మంత్రి కారును నిరసనకారులు కాల్వలోకి నెట్టారు. ఆయన కారుతోపాటు పలు వాహనాలను నీటిలోకి నెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మాజీ మంత్రి కారును చుట్టుముట్టిన జనం.. దాన్ని రోడ్డుపై దొర్లిస్తూ నీటిలో పడేశారు. @Imposter_Edits పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి సైతం మాట్లాడాడు. “గ్యాస్ లేదు, ఇంధనం లేదు, అవసరమైన మందులు లేవు.. ప్రజలు బాధపడుతున్నారు.. ఒక పూట ఆహారంతో ప్రజలు జీవిస్తున్నారు’’ అంటూ దానిలో పేర్కొన్నాడు.
వైరల్ వీడియో..
In Sri Lanka, Anger over the cost of living the public threw politicians’ cars into the waters.
— ?_Imposter_?️ (@Imposter_Edits) May 11, 2022
కాగా.. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కొంతవరకు విదేశీ కరెన్సీ కొరత కారణంగా ఏర్పడింది. ఆహారం, ఇంధనం దిగుమతుల కోసం డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. నిరంతరాయంగా విధించిన విద్యుత్ కోతలు, నిత్యావసరాల కొరతతో ప్రజలు ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఈ క్రమంలో కాగా.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స , ప్రధాన మంత్రి మహీందా రాజపక్స రాజీనామా అనంతరం.. రాజకీయ గందరగోళానికి ముగింపు పలికేందుకు శ్రీలంక 26వ ప్రధానిగా 73 ఏళ్ల రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: