Third Covid Wave :ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల అప్పుడే థర్డ్ కోవిడ్ వేవ్ ప్రారంభమైన సూచనలు.. కేంద్రం వెల్లడి

ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల అప్పుడే కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు. ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా సుమారు 3.9 లక్షల కేసులకు సంబంధించిన సమాచారం తమకు అందుతోందని అయన చెప్పారు...

Third Covid Wave :ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల అప్పుడే థర్డ్ కోవిడ్ వేవ్ ప్రారంభమైన సూచనలు.. కేంద్రం వెల్లడి
Vaccination

Edited By:

Updated on: Jul 13, 2021 | 7:43 PM

Third Covid Wave :ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల అప్పుడే కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు. ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా సుమారు 3.9 లక్షల కేసులకు సంబంధించిన సమాచారం తమకు అందుతోందని అయన చెప్పారు. మన దేశాన్ని ఇది తాకకుండా చూసేందుకు మనం ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఏడాది ఆరంభంలో సెకండ్ వేవ్ సందర్భంగా వరల్డ్ వైడ్ గా దాదాపు 9 లక్షల కేసులకు సంబంధించి తమకు సమాచారం అందిందని ఆయన అన్నారు. థర్డ్ వేవ్ రాకుండా నివారించాలని, ప్రజలు కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే హితవు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ తరుణంలో నిర్లక్ష్యంగా ఉండరాదని.. ఈ నిర్లక్ష్యమే పనికి రాదని ఆయన పేర్కొన్నారు. ఆంక్షలు ఎత్తివేసినంత మాత్రాన ఈ వైరస్ ముగిసిందని భావించరాదన్నారు.

ఇదే సమయంలో మాట్లాడిన ఆరోగ్య శాఖ సంయుక్గ్తా కార్యదర్శి లవ్ అగర్వాల్.. దేశంలో పలు చోట్ల ప్రజలు మళ్ళీ పెద్ద సంఖ్యలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా పోటెత్తడాన్ని ప్రభుత్వం గమనించిందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అధికారులు చూశారన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ప్రజలు కోవిడ్ ప్రొటొకాల్స్ ని పాటించాలని ఆయన కోరారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ హితవునే ప్రధానంగా చెబుతూ వచ్చిందన్నారు. వ్యాక్సినేషన్ కొరత నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : మహబూబాబాద్‌లో పోడు పోరాటం.. ఫారెస్ట్ అధికారులను చితకబాదిన స్థానికులు..:Forest Officials Video.

 కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.. వెలుగులోకి సంచలన విషయాలు.లైవ్ వీడియో :Kathi Mahesh Death Live Video.

 స్కూల్ విద్యార్థులకు కండోమ్స్ కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ..సంచలన నిర్ణయం:Condoms To Students Video.

 COVID-19 Cases Rising Live Video: కరోనా టెర్రర్..! ఇంకా ఎంత కాలం ఈ కరోనా కొత్త వేరియంట్ వణికిపోతున్న ప్రజలు..లైవ్ వీడియో.