
లండన్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫోన్‌ల దొంగతనాలు బాధితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ల ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. వారంతకు వారే వాటిని బాధితులకు తిరిగిచ్చేస్తున్నారు. ఇందుకు కారణమేంటంటే.. చోరీకి గురైనవన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు కావడమే. అవును అక్కడి దొంగలలు.. ఆండ్రయిడ్ ఫోన్లను కొట్టేయడం చీఫ్‌గా ఫీలవుతున్నారట.. కేవలం ఐఫోన్‌లను మాత్రగే దొంగలించాలని నిర్ణయించుకున్నారట.లండన్ సెంట్రిక్ నివేదించిన ప్రకారం.. 32 ఏళ్ల సామ్ అనే వ్యక్తి ఆశ్యర్యకర ఘటనను ఎదుర్కొన్నాడు. అతను దక్షిణ లండన్‌లోని రాయల్ మెయిల్ డిపోలో నడుచుకుంటూ వెళుతుండగా, ఓ 8 మంది గ్యాంగ్ అతన్ను చుట్టుముట్టి.. అతని ఫోస్ సహా ఆనే వద్ద వస్తువులను ఎత్తుకెళ్లారు. అయితే కాస్త దూరం వెళ్లా ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి వెనక్కి వచ్చి.. సామ్ కు తన ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చి మాకు “శాంసంగ్ వద్దు” అని చెప్పి వెళ్లాడు. అది విన్న శామ్.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అతను ఒక్కడే కాదు. హాక్నీలో పనిచేసే మార్క్ అనే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మార్క్ నడుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు.. అయితే అప్పుడు మార్క్ అతన్ని పట్టుకునేందుకు పరిగెత్తాడు.. కానీ కాస్తా ముందుకెళ్లి ఆగిపోయాడు.. అప్పుడే అక్కడ ఊహించని ఘటన జరిగింది. ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగ.. తన చేతిలో ఉన్న ఫోన్‌ను చూశాడు.. అది శాంసంగ్ కావడంతో దాన్ని అక్కడే నేలపై పడేసి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనపై స్పందించిన మార్క్.. తన ఫోన్ దొంగలించిన దాని కంటే.. ఆఫోన్ అతను తీసుకోవడానికి అతను తిరస్కరిండమే తనను ఎక్కవ బాధించిందని అన్నాడు.
ఈ వరుస దొంగతనాలపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు స్పందిస్తూ.. దొంగలు ఇలా ఫోన్‌లు తిరిగి ఇచ్చేందుకు కారణంగా.. వారు కేవలం ఐఫోన్‌లను మాత్రమే దొంగలించడాని ఇష్టపడుతున్నారని చెప్పాడు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఐఫోన్‌లు రీసేల్ ఎక్కువగా ఉందని.. అలాగే ఇవి దొంగలను ఆకర్శిస్తున్నాయన్నాడు. అలాగే ఆండ్రయిడ్ ఫోన్లను కొట్టేయడం ద్వారా తమకు గిట్టుబాటు కావట్లేదని.. దొంగలు వాటిని అక్కడే వదిలేసి పోతున్నారని తెలిపారు. అలాగే ఈ చోరీలకు పాల్పడుతున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసంఇ ఇక్కడ క్లిక్ చేయండి.