Kim Jong Un: ఇదేం అరాచకం మావ.! కలియుగ యమ’కిమ్’కరుడు.. అన్ని ఫోన్లు చూసేస్తున్నాడుగా

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ వింత నిర్ణయాలతో.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జైలు పక్షుల్లా బతుకుతున్నారు అక్కడి ప్రజలు. అక్కడి ప్రజలు ఉపయోగించిన ఫోన్‌లో ఆటో సెన్సార్షిప్ ఎలా పనిచేస్తుందో చూసి ప్రపంచం నివ్వెరపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Kim Jong Un: ఇదేం అరాచకం మావ.! కలియుగ యమకిమ్కరుడు.. అన్ని ఫోన్లు చూసేస్తున్నాడుగా
Kim Jong Un

Updated on: Jun 02, 2025 | 7:17 AM

ఉత్తర కొరియా ప్రజలు సౌత్ కొరియాతో పాటు ప్రపంచంతో సంబంధాలు లేకుండా దారుణంగా నిర్బంధిస్తోంది కిమ్ ప్రభుత్వం. ఆ దేశం తన పౌరులను బాహ్య ప్రపంచ వాస్తవాలకు దూరంగా ఉంచేందుకు అన్ని రకాల మీడియాలో కఠినమైన సెన్సార్‌షిప్‌ను అమలు చేస్తుంది. అక్కడి ప్రజలు వాడే మొబైల్స్‌లో కొన్ని రకాల పదాలు ఆటో కరెక్ట్‌ అవుతున్నాయి. ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఫోన్ లో ఆటో సెన్సార్షిప్ ఎలా పనిచేస్తుందో చూసి నివ్వెరపోయింది ప్రపంచం. శత్రుదేశం అయిన దక్షిణ కొరియాకు సంబంధించిన పేరును, పదాలను ఉత్తరకొరియాలో వినియోగించకుండా చేశారు. ఏదైనా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా స్పెల్లింగ్ మారిపోతుంది.

ఉదాహరణకు దక్షిణకొరియాలో స్నేహితుడిని ఒప్పా అంటారు. కానీ, ఉత్తరకొరియా ఫోన్లలో ఒప్పా అనే పదం టైప్‌ చేయగానే.. అది ఆటోమేటిక్‌గా కామ్రేడ్‌ అని మారిపోతుంది. అంటే ఒప్పా అనే పదం సౌత్ కొరియాకు చెందినది అయినందువల్ల.. ఆ పదం బదులు కామ్రేడ్ అని పడేలా సెట్ చేశారు. అదే సౌత్‌ కొరియా అని టైప్‌ చేస్తే.. పప్పేట్‌ స్టేట్‌ అని ఆటోకరెక్ట్‌ అవుతోంది. దీంతోపాటు ఆ ఫోన్ల యూజర్లకు ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ఉండదు. ఇక ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడో.. ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో.. సౌత్ కొరియాతో పాటు ప్రపంచ దేశాలతో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారా లేదా అని ఎప్పటికప్పుడు స్పై చేస్తుంటారు.

అందుకోసం.. ఫోన్ ప్రతి ఐదు నిమిషాలకు స్క్రీన్‌షాట్‌లను తీసి, ఒక ఫోల్డర్ లో సేవ్ చేస్తుంది. అది అధికారులకు మాత్రమే ఓపెన్ అవుతుంది. దీని ద్వారా ప్రతి పౌరుడి కదలికలను గమనిస్తుంటారు అధికారులు. మొత్తంగా ప్రపంచ దేశాలతో ప్రజలకు సంబంధం లేకుండా చేయడమే కాకుండా.. ఫోన్లలో ఏం వెతకాలో.. ఏం చూడకూడదో కూడా నిషేధించే స్థాయికి వెళ్లింది కిమ్‌ అరాచకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి