Ukraine-Russia War: పశ్చిమ దేశాలకు ప్రతి చర్యగానే ఉక్రెయిన్ పై యుద్ధం.. “విక్టరీ డే” లో పుతిన్ కీలక వ్యాఖ్య

|

May 09, 2022 | 9:22 PM

ఉక్రెయిన్‌పై(Ukraine) యుద్దాన్ని రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌ మాతృభూమిని రక్షించడానికే ఈ యుద్దం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రష్యా విక్టరీ పరేడ్‌లో ఈ మేరకు...

Ukraine-Russia War: పశ్చిమ దేశాలకు ప్రతి చర్యగానే ఉక్రెయిన్ పై యుద్ధం.. విక్టరీ డే లో పుతిన్ కీలక వ్యాఖ్య
Putin
Follow us on

ఉక్రెయిన్‌పై(Ukraine) యుద్దాన్ని రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌ మాతృభూమిని రక్షించడానికే ఈ యుద్దం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రష్యా విక్టరీ పరేడ్‌లో ఈ మేరకు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాల చర్యకు ప్రతిచర్యగానే సైనిక చర్య చేపట్టినట్టు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న ‘విక్టరీ డే(Victory Day)’ పేరుతో భారీగా వేడుకలు నిర్వహిస్తుంటారు. మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ దగ్గర కలర్‌ఫుల్‌గా ఈ సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఉక్రెయిన్‌లో రష్యా చర్యను రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ పోరాటంతో పోల్చారు పుతిన్‌. ఉక్రెయిన్‌ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యా బలగాలు అక్కడ పోరాడుతున్నాయని అన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్‌ సైనికులకు నివాళులర్పించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి నియో నాజీలను ఆ దేశం నుంచి తరిమి కొడతామని రష్యా చెబుతూనే ఉంది.

విక్టరీ డే పరేడ్‌లో పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అలాంటి ప్రకటనేమీ ప్రస్తుతానికి లేకపోడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్‌ సైనిక చర్యను ప్రకటించారు. అయితే పుతిన్‌ వ్యాఖ్యలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గట్టిగా కౌంటరిచ్చారు. త్వరలోనే ఉక్రెయిన్‌లో రెండు విజయోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యలపై బ్రిటన్ రక్షణశాఖ మంత్రి బెన్ వాలెస్ స్పందించారు. మాస్కో పరేడ్‌లో చేసిన ప్రసంగంతో పుతిన్.. ప్రపంచాన్ని భయపెట్టాలనుకుంటున్నారని అన్నారు. రష్యా ప్రజలను, ప్రపంచాన్ని ప్రస్తుతం జరుగుతోన్న సైనిక చర్యను చూపి భయపెట్టాలని పుతిన్‌ భావిస్తున్నారని ఆరోపించారు. నిష్కారణంగా జరుగుతున్న ప్రస్తుత యద్ధంతో ఉపయోగం లేదని.. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను కచ్చితంగా ఇది అవమానించడమేనని బన్ వాలెస్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల  కోసం ఈ లింక్ క్లిక్ చేయండి