రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ దిగుమతులపై ఆంక్షలు.. మూల్యం చెల్లించుకోనున్న అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్

Russia Ukraine War: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపు రెండు వారాల నుంచి జరుగుతోంది. మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావతడంతో.. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది.

రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ దిగుమతులపై ఆంక్షలు.. మూల్యం చెల్లించుకోనున్న అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్
Clean Energy
Follow us

|

Updated on: Mar 09, 2022 | 6:16 PM

Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపు రెండు వారాల నుంచి జరుగుతోంది. మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావతడంతో.. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమ మిత్రదేశాలు.. రష్యా మధ్య వైరం మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు, గ్యాస్ సహా అన్నింటి దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ సమన్వయ చర్యల్లో భాగంగా యూరోపియన్ యూనియన్ సైతం (EU) ఈ వారం చివరి నాటికి రష్యన్ గ్యాస్ దిగుమతులను దశలవారీగా నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే బ్రిటన్ కూడా (UK) రష్యా చమురు దిగుమతులను దశలవారీగా చేయడానికి అంగీకరించింది. అదే సమయంలో రష్యా చమురు, గ్యాస్ అన్ని దిగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇతర పాశ్చాత్య మిత్రదేశాలతో పోలిస్తే యూరప్ దేశాలన్నీ.. రష్యాపైనే చాలా ఎక్కువ శక్తి-ఆధారితంగా ఉన్నాయి. అయినప్పటికీ.. జర్మనీ నార్డ్ స్ట్రీమ్-1 పైప్‌లైన్‌ను మూసివేసే క్రెమ్లిన్‌కు ధీటైన జవాబిచ్చింది. ఈ క్రమంలో ఈయూ.. రష్యాకు ప్రత్యామ్నాయాలను వెతికేందుకు కూడా అవకాశం లేకుండా చేసింది. కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. తాము కేవలం బెదిరించే సరఫరాదారుపై ఆధారపడలేమంటూ పరోక్షంగా రష్యాను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇప్పటికే రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావాన్ని వ్యాపారులు, వినియోగదారులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రభావం కారణంగా ఈ దశలో రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించడంలో మద్దతుగా తాము USలో చేరలేమని యూరోపియన్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. దీనిపై వ్యాసకర్తలు కెవి రమేష్, జహంగీర్ కీలక విషయాలను వెల్లడించారు. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ దిగుమతులపై ఆంక్షలు విధిస్తే.. మూల్యం చెల్లించుకునేది అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ అంటూ వ్యాసకర్తలు పేర్కొంటున్నారు.

ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడం, ఉత్పత్తిని పెంచడానికి సౌదీ అరేబియాను ఒప్పించడం లాంటివి యూరప్‌లో ఉన్న సంక్షోభాన్ని కొంతవరకు అధిగమించడంలో సహాయపడుతుందని జహంగీర్ అలీ పేర్కొన్నారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతుండగా, పశ్చిమ దేశాలు భయాందోళనతో ఉన్నాయి. 2008 నుంచి ఇప్పుడే ముడి చమురు ధర అత్యధిక స్థాయికి చేరుకుంది. మాస్కో నుండి దిగుమతులను నిషేధించే అవకాశాలను అనేక దేశాలు పరిశీలిస్తున్నందున ఇది ఇంతటితో ఆగిపోయే అవకాశం లేదు. US ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. రష్యా డిసెంబర్ 2021లో రోజుకు దాదాపు ఎనిమిది మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసింది. పెట్రోలియం పరంగా సౌదీ అరేబియా తర్వాత రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా అమెరికా ఉంది. రష్యా ముడి చమురులో దాదాపు సగం యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుండగా, 42 శాతం ఆసియా, ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని పాశ్చాత్య దేశాలు ఆలోచించడం.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బలవంతంగా మార్చడానికి ఉపయోగించబడే చివరి ఆర్థిక ఆయుధం. అయితే ఇది క్రెమ్లిన్ విధానాలపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలు పుతిన్‌కు వ్యతిరేకంగా తన చివరి ఆర్థిక ఆయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంటే, అది చాలా ప్రభావాలను చూపుతుంది. ఇది జర్మనీ, పోలాండ్, ఇటలీ, ఆస్ట్రియా, గ్రీస్‌లలో 60 శాతం రష్యా చమురు ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. దీనికారణంగా ఈ దేశాలలో విద్యుత్ కొరత ఏర్పడి ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముంది. రష్యా చమురు దిగుమతిపై నిషేధం ఐరోపాలో మాంద్యంకు దారితీస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య దేశాలే కాదు, రష్యా చమురుపై నిషేధం ప్రభావం ఆసియా దేశాలలో కూడా కనిపిస్తుంది. దీంతోపాటు ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. దీని సహజ పరిణామం నిత్యావసర ధరల ద్రవ్యోల్బణంపై కూడా పడుతుంది.

సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాలను తమ ఉత్పత్తిని పెంచేలా ఒప్పించడం ద్వారా ఇంధన సంక్షోభాన్ని అధిగమించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో పశ్చిమ దేశాలు విజయవంతమైతే, క్రూడ్ ఆయిల్ రవాణా సంక్షోభాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. యూరోపియన్ కమీషన్ రష్యన్ గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ వారం ఒక ప్రణాళికను సైతం ప్రకటించింది. “చమురు – గ్యాస్ ఆంక్షలతో ఆదాయాన్ని త్వరగా తగ్గించడం అనేది మాస్కోను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కానీ యూరోపియన్ నాయకులు దశలవారీ విధానం అంటూ చర్చలు చేస్తున్నారు. అయితే.. రష్యా ఇంధన సరఫరాలపై తమ ఆధారపడటాన్ని బహిరంగంగా అంగీకరించారని అంతర్జాతీయ ప్రతినిధులు పేర్కొంటున్నారు. రష్యా చమురు దిగుమతులపై పూర్తి నిషేధం విధించడం.. ఉక్రేనియన్లు తమ రక్తంతో యుద్ధానికి మూల్యం చెల్లించడం కంటే, రక్తరహిత మార్గంలో వెచి చూడటం మంచిదని అనిపిస్తుంది.

కరోనా మహమ్మారి తర్వాత ఇప్పటికే ఆర్థిక మాంద్యం నుంచి పోరాడుతున్న ప్రపంచానికి ఉక్రెయిన్‌పై రష్యా దాడి రెండవ దెబ్బ అని కెవి రమేష్ పేర్కొన్నారు. ఉక్రేనియన్ తో యుద్ధం ఎలా ముగుస్తుందనే దానితో సంబంధం లేకుండా.. వ్లాదిమిర్ పుతిన్ ప్రచ్ఛన్న యుద్ధంతో కొత్త మార్గానికి బాటలు వేశారు. ఈ యుద్ధం వల్ల అందరిపై తీవ్ర ప్రభావం కనిపించే పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా – ఉక్రెయిన్ దేశాల్లో చమురు, సహజ వాయువు, గోధుమలు, పొద్దుతిరుగుడు నూనె, బొగ్గు, ఇనుము, ఉక్కు, టైటానియం, పల్లాడియం, బంగారం, రాగి వంటి ప్రధాన డిమాండ్ వస్తువుల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ఎక్కువే. కావు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే.. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతుంది. యుద్ధం వాతావరణ మార్పులను నియంత్రించే ప్రపంచ ప్రయత్నాన్ని నాశనం చేస్తే, రష్యా పరిణామాల నుంచి అందరు తప్పించుకోలేదు. ఉక్రెయిన్‌పై దాడి చేసి, పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ, పుతిన్ ప్రపంచ క్రమాన్ని ఒంటరిగా మార్చారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని కెవి రమేష్ పేర్కొన్నారు.

Also Read:

Russia Ukraine Crisis: అష్ట దిగ్భంధనంలో రష్యా.. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న తొలిదేశం!

Russia Ukraine Crisis: ఎల్లలు దాటిన భారత దేశ సేవలు.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ మహిళ

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..