సిగ్నల్ యాప్‌ను చైనా నిషేధించినట్లు సమాచారం. వీపీఎన్ లేకుండా ఈ యాప్‌ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు స్పష్టమవుతోంది.
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సిఫార్సు చేసిన ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్-‘సిగ్నల్’ను చైనా వేటు వేసినట్లుగా తెలుస్తోంది. చైనాలో ఈ యాప్‌ను వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లేనిదే యాక్సెస్ చేయడం కష్టంగా ఉంది. దీంతో ఇతర అమెరికా సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోందని టెక్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలను తమ పౌరులకు దూరంగా ఉంచింది డ్రాగన్ దేశం. ఇంటర్ నెట్‌పై పరిమితులు విధించేలా రూపొందించిన ‘గ్రేట్ ఫైర్‌వాల్’తో అనేక సైట్లను అడ్డుకుంటోంది అక్కడి సైబర్ విభాగం. నిషేధిత అంశాలపై చర్చించేందుకు రూపొందిన క్లబ్‌హౌస్ అనే ఆడియో ప్లాట్‌ఫాంను సైతం గత నెలలో నిలిపివేసింది చైనా.
వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన గోప్యతా విధానంతో చాలా మంది సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిగ్నల్ డౌన్లోడ్ చేసుకుంటున్నవారి సంఖ్య చైనాలో నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. ఎలాన్ మస్క్ సైతం ఈ యాప్ ఉపయోగించాలని సూచించడం వల్ల అంతర్జాతీయంగా ఈ మెసేజింగ్ యాప్‌కు విశేష ప్రాచుర్యం లభించింది. దీంతో అయితే నిషేదం విధించినట్లుగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. కట్టడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి సెర్చ్ ఇంజన్ ప్లే స్టోర్‌లో అది కనిపించడం లేదు. దీంతో సిగ్నల్‌పై అనధికారికంగా వేటు పడిందని అనుకుంటున్నారు. సహజంగా చైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్న ఎలాంటి ప్రకటన చేయదని టెక్ విశ్లేషకులు అంటున్నారు.
Highest Denomination Currency: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన..
World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు
Oye Bat Dikha: “తొలి అనుభావాన్ని” పంచుకున్న ఇషాన్ కిషన్.. కోహ్లీ చెబితే కానీ అర్థం కాలేదు..