
జూలై 4వ తేదీన ప్రారంభం కానున్న పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పూరీ క్షేత్రంలో ఏటా జరిగే ఈ యాత్రకు ఈ సారి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏటా ఆషాడ మాసంలో పూరీ రథయాత్రను జరపడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ యాత్రను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రథాలు, వాటి చక్రాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఎంతో నైపుణ్యం ఉన్న కళాకారులు వీటిని తయారుచేస్తారు. పూరీ క్షేత్రానికి విమాన, రైలు, బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ఇక విజయవాడ, విశాఖపట్నం నుంచీ కూడా ప్రత్యేక రైలు సదుపాయం ఉంది. ఇప్పటికే భువనేశ్వర్ రద్దీగా మారిపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లూ భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి.