Queen Elizabeth: వైద్యుల పర్యవేక్షణలో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2.. ఆందోళన వ్యక్తం చేసిన కొత్త ప్రధాని లిజ్ ట్రస్

|

Sep 08, 2022 | 7:09 PM

బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆరోగ్యం బాగాలేదు. వైద్యుల బృందం పర్యవేక్షణలో రాణి ఎలిజబెత్‌ ఉన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ట్వీట్టర్ ద్వారా వెల్లండిచారు.

Queen Elizabeth: వైద్యుల పర్యవేక్షణలో బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2.. ఆందోళన వ్యక్తం చేసిన కొత్త ప్రధాని లిజ్ ట్రస్
Queen Elizabeth
Follow us on

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2(Queen Elizabeth II) ఆరోగ్యంపై ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. వైద్య పర్యవేక్షణలో ఆమె ఉండాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె స్కాట్‌లాండ్‌లోని బాల్మోరల్ కోటలో క్షేమంగానే ఉన్నారని తెలిపింది. అయితే క్వీన్‌ ఎలిజబెత్‌ అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే 73 ఏళ్ల ప్రిన్స్‌ చార్లెస్‌,  ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్‌ విలియమ్‌ హుటాహుటిన స్కాట్‌లాండ్‌కు బయలుదేరారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 రాణి  వయోభారంతో పాటు, కొన్నిరోజులుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత అక్టోబరు నుంచి ఆమె కొంత తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా, 96 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌ 2 గత ఏడాది అక్టోబర్‌ నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నడవడం, నిల్చోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

అయితే తన ప్రివీ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. రాణి సౌకర్యంగా ఉన్నారని, స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్‌లో ఆమె వేసవికాలం గడిపిందని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. రాణి ఆరోగ్యం గురించి ప్యాలెస్ ప్రకటనతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు క్వీన్‌ ఎలిజబెత్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేసిన వెంటనే బ్రిటన్‌ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ట్వీట్ చేశారు.


బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బదులుగా ..

క్వీన్ ఎలిజబెత్ ఈ సమయంలో ఎక్కడికీ కదలలేకపోతున్నారు. దీంతో ఆమె లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బదులుగా స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్‌లో ఉంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం