Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి స్కాట్ లాండ్ లోని బల్మొరల్, క్యాజిల్ లో ఆమె తుదిశ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు. బ్రిటన్ కు ఏకంగా డెబ్బయి ఏళ్ల పాటు రాణిగా పాలించారు. ఆమె తన ఇరవై ఐదో ఏట నుంచి బ్రిటన్ మహారాణిగా బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం రాణిగా ఉన్నారు. అత్యధిక కాలం రాణిగా వ్యవహరించి చరిత్ర సృష్టించారు. ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరువయ్యారు. గత కొద్ది రోజులుగా క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్లు వార్తలు వచ్చాయి. ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గురువారం రాత్రి క్వీన్ ఎలిజబెత్ మరణించినట్లు తెలిసింది. ఎలిజబెత్ మరణంతో ఆమె జీవితానికి సంబంధించిన సంఘటనలు అనేకం ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నాయి. ఇందులో ఒకటి ఆమె ఏడాదిలో రెండుసార్లు పుట్టినరోజు జరుపుకోవడం కథ కూడా ఒకటి.
నిజానికి, క్వీన్ ఎలిజబెత్ తన పుట్టినరోజును సంవత్సరానికి రెండుసార్లు జరుపుకునేవారు. ఎలిజబెత్-II జూన్ 2, 1953న బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. బ్రిటన్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అనేక కామన్వెల్త్ దేశాలకు కూడా రాణి. అప్పటి నుంచి ఆమె పుట్టినరోజును రెండుసార్లు జరుపుకునే ప్రక్రియ కూడా మొదలైంది. అయితే, ఆమె తన పుట్టినరోజును రెండుసార్లు జరుపుకోవడం వెనుక కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
బ్రిటన్ రాణి పుట్టినరోజు ఏప్రిల్ 21న జరుపుకుంటారు. కానీ, బ్రిటన్ సింహాసనాన్ని పొందిన తర్వాత, ఆమె రెండవ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును ఆమె అధికారిక పుట్టినరోజు. ఈ పుట్టినరోజును అధికారికంగా జరుపుకుంటారు. ఈ రోజున కవాతులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రెండవ పుట్టినరోజు జూన్‌లో వస్తుంది. ఈ నెలలో మంచి వాతావరణం ఉంటుందని అందుకే జూన్ 17న ఆమె రెండవ పుట్టినరోజు జరుపుకుంటారు. రెండవ అధికారిక పుట్టినరోజుకు జూన్ 17వ తేదీని ఎందుకు ఎంచుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే చరిత్ర పుటలు తిరగేయాల్సిందే.
వాస్తవానికి, అధికారిక పుట్టినరోజు 1748 సంవత్సరంలో కింగ్ జార్జ్ II ప్రకటనతో ప్రారంభమైంది. రాజకుటుంబానికి చెందిన ఏ యువరాజు సింహాసనం అధిష్టించినా ఆ వ్యక్తి పుట్టినరోజునాడు పెద్ద వేడుకలు నిర్వహిస్తారు. కవాతు కూడా ఉంటుంది. ఎడ్బార్డ్ సింహాసనాన్ని తీసుకున్నప్పుడు, అతని పుట్టినరోజు జరుపుకోవలసి ఉంది. కానీ అతని పుట్టినరోజు నవంబర్ నెలలో వచ్చేది. అప్పుడు చాలా చలిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది జూన్‌లో జరుపుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో జూన్ 17 న ఫిక్స్ చేయబడింది. అప్పటి నుండి ఇక్కడ సింహాసనాన్ని అధిష్టించిన రాజు తన అధికారిక పుట్టినరోజును జూన్ 17 న జరుపుకుంటారు. ఈ రోజున కవాతులు మొదలైన పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 14 మంది ఉన్నత అధికారులు, దాదాపు 200 గుర్రాలు, సైనికులు ఈ కవాతలులో పాల్గొంటారు. ఇది కాకుండా 400 మంది సంగీత విద్వాంసులు ఒకచోట చేరి, సంగీతం ద్వారా రోజును చిరస్మరణీయం చేస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి