ఉక్రెయిన్‌పై ‘చివరి ప్రయత్నం’గా పుతిన్ అణ్వాయుధం ప్రయోగం?

శాంతి చర్చలు విఫలం కావడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చివరి అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉక్రెయిన్‌పై టాక్టికల్ అణు ఆయుధాలను ప్రయోగించే అంశాన్ని పునరాలోచించాలని రష్యాకు బీజింగ్ సందేశాన్ని పంపినట్లు  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, సీనియర్ యూరప్ అధికారులు ధృవీకరించారు

ఉక్రెయిన్‌పై చివరి ప్రయత్నంగా పుతిన్ అణ్వాయుధం ప్రయోగం?
Putin Could Deploy Tactical Nuckear Weapons In Ukraine

Updated on: Aug 29, 2026 | 2:27 PM

ఉక్రెయిన్‌పై తాజాగా  దాడులను తీవ్రతరం చేసింది రష్యా. ఆగస్టు 26 అర్థరాత్రి 260 క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఇవి కీవ్ లోని విద్యుత్ ప్లాంట్ల కు భారీ నష్టాన్ని కలిగించాయి.  అయితే శాంతి చర్చలు విఫలం కావడంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చివరి అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.  అధ్యకుడు పుతిన్ ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణ్వాయుధాలతో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు  బ్లూమ్ బెర్గ్ పత్రిక సంచలన వార్త ప్రచురించింది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గల ప్రకారం, రష్యా వద్ద ఇస్కాందర్-ఎమ్, కాలిబర్ క్రూయిజ్ మిస్సైల్, గ్యావిటీ బాంబులు, హైపర్సోనిక్ కింజాల్‌తో సహా కనీసం 2,000 వ్యూహాత్మక అణ్వాయుధాలున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా కనీసం 5 సార్లు వ్యూహాత్మక అణ్వాయుధాలకు సంబంధించి విన్యాసాలు నిర్వహించినప్పటికీ వాటిని ఒక్కసారి కూడా  ప్రయోగించలేదు.

ఉక్రెయిన్‌పై టాక్టికల్ అణు ఆయుధాలను ప్రయోగించే అంశాన్ని పునరాలోచించాలని రష్యాకు బీజింగ్ సందేశాన్ని పంపినట్లు  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, సీనియర్ యూరప్ అధికారులు ధృవీకరించారు. యుద్ధరంగంలో తక్షణ సైనిక అవసరాల కోసం ఉపయోగించే పరిమిత పరిధి అణ్వాయుధాలనే వ్యూహాత్మక అణ్వాయుధాలంటారు.

యుద్ధరంగంలో నిర్దిష్ట లక్ష్యాలను దెబ్బతీయడానికి  “టాక్టికల్ న్యూక్స్” ను ప్రయోగించే వీలుంటుంది.  ఇవి నగరాలను పూర్తిగా ధ్వంసం చేసే భారీ  అణ్వాయుధాల కంటే భిన్నంగా ఉంటాయి.   పరిమిత పరిధిలో, తక్షణ  ప్రయోజనాల కోసం ఈ స్వల్ప శ్రేణి ఆయుధాలను రష్యా తన అమ్ముల పొదిలో చేర్చింది. అయితే  పరిమాణంలో చిన్నవైనప్పటికీ,  విస్తృత పరిధి ఉన్న ప్రాంతాన్ని రేడియోధార్మికతతో పూర్తిగా కలుషితం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. ఇవి ప్రమాదకర వినాశకర శక్తితో భారీ విధ్వంసాన్ని సృష్టించగలవు. అణు విస్ఫోటనం తర్వాత ప్రమాదకర రేడియోధార్మిక వ్యర్థాలు పర్యావరణంలోకి వేగంగా  వ్యాపిస్తాయి. సాధారణంగా ఇతర మార్గాలన్నీ  విఫలమైనప్పుడు చివరి ప్రయత్నంగా వ్యూహాత్మక అణ్వాయుధాలను ప్రయోగిస్తారు.  ప్రస్తుతానికి రష్యా అణ్వాయుధాల దాడి కంటే కీవ్ నగరం మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణి దాడులను తీవ్రతరం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us