వెనిజులాలో పెను విపత్తు.. వరుస భూకంపాలతో మృత్యుఘోష.. అంతకంతకూ పెరుగుతున్న మృత్యుల సంఖ్య!

వెనిజులాలో బుధవారం (జూన్ 24) సాయంత్రం సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 164 మంది మరణించగా, 971 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు మృతుల సంఖ్య 32 గా ఉన్నప్పటికీ, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో ఈ సంఖ్య వేగంగా పెరిగింది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

వెనిజులాలో పెను విపత్తు.. వరుస భూకంపాలతో మృత్యుఘోష.. అంతకంతకూ పెరుగుతున్న మృత్యుల సంఖ్య!
Strongest Earthquakes In Venezuela

Updated on: Jun 25, 2026 | 4:35 PM

వెనిజులాలో బుధవారం (జూన్ 24) సాయంత్రం సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 164 మంది మరణించగా, 971 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు మృతుల సంఖ్య 32 గా ఉన్నప్పటికీ, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో ఈ సంఖ్య వేగంగా పెరిగింది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. కరేబియన్ తీరంలోని మోరోన్ నగరానికి సమీపంలో కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే 7.2, 7.5 తీవ్రతతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. గత శతాబ్ద కాలంలో వెనిజులాను తాకిన అత్యంత బలమైన భూకంపాలు ఇవేనని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, కారకాస్‌కు దాదాపు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంతో పాటు కొలంబియాలోనూ భవనాలు ఊగిపోయాయి. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, తర్వాత వాటిని ఉపసంహరించుకుంది.

నరకప్రాయంగా మారిన తీరప్రాంతం

భూకంపం వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న తీరప్రాంతం ‘లా గువైరా’ను తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ “విపత్తు ప్రాంతం”గా ప్రకటించారు. అక్కడ చాలా భవనాలు నిలువునా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు పిల్లలను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. వెనిజులా రాజధాని కారకాస్‌లో భూకంపం రాగానే జనం భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. నగరంలో విద్యుత్ సరఫరా, సెల్‌ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయమైన సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతినడంతో మూసివేశారు. సబ్‌వే రైళ్లు, గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసి, వాటిని ఆశ్రయ కేంద్రాలుగా మారుస్తున్నారు. కాగా, భూకంప అనంతర ప్రకంపనల ముప్పు ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా వీధులు, పార్కులు, మెట్రో స్టేషన్లలోనే రాత్రంతా గడిపారు.

విపత్కర పరిస్థితుల్లో వెనిజులాకు ప్రపంచ దేశాల నుండి సహాయం వెల్లువెత్తుతోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ.. తక్షణమే సహాయక చర్యల బృందాలను, వైద్య వనరులను, మానవతా సహాయాన్ని పంపుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, రూబియోకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇప్పటికే సహాయక సిబ్బందిని పంపిన ఖతార్, మెక్సికో, ఎల్ సాల్వడార్, ఈక్వెడార్ దేశాల నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం స్థానిక ప్రజలు, రెస్క్యూ టీమ్‌లు పవర్ టూల్స్ సహాయంతో శిథిలాలను తొలగించి ప్రాణాలను కాపాడేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us