Pakisthan: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ మద్దతుదారుల అరాచకం.. ప్రభుత్వాస్తుల ధ్వంసం.. రంగంలోకి దిగిన ఆర్మీ

|

May 26, 2022 | 12:36 PM

పాక్ మాజీ ప్రధానికి మద్దతుగా చేపట్టిన మార్చ్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిరసనల్లో భాగంగా ఇస్లామాబాద్ లోని ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. ప్రస్తుతం నిరసనకారులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి

Pakisthan: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ మద్దతుదారుల అరాచకం.. ప్రభుత్వాస్తుల ధ్వంసం.. రంగంలోకి దిగిన ఆర్మీ
Pakistan Violence
Follow us on

Pakistan Violence: దాయాది దేశం పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం వంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ప్రచారం జోరుగా సాగుతోంది. మళ్ళీ ఎన్నికలను డిమాండ్ చేస్తూ.. పాక్ మాజీ ప్రధానికి మద్దతుగా చేపట్టిన మార్చ్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వేలాది మంది PTI మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు. నిరసనల్లో భాగంగా ఇస్లామాబాద్ లోని ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. ప్రస్తుతం నిరసనకారులకు సంబంధించిన వీడియోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల అవిశ్వాస తీర్మానం తర్వాత అధికారం కోల్పోయిన పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కొత్త డిమాండ్‌ను లేవనెత్తారు. పాకిస్తాన్‌లో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్‌ చేస్తూ..  ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీకి పిలుపునిచ్చారు. తన మద్దతుదారులతో కలిసి బుధవారం ఇస్లామాబాద్‌లో శాంతియుత ర్యాలీని చేపట్టారు. అయితే ర్యాలీ నేపథ్యంలో పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ మార్చ్‌కు అంతరాయం కలిగించే ప్రయత్నంలో భాగంగా నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ప్రయోగించారు. వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు చెట్లు, వాహనాలకు నిప్పంటించారని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేయడంతో, నిరసనకారులు మళ్లీ ఎక్స్‌ప్రెస్ చౌరంగికి నిప్పుపెట్టారని పోలీసులు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నిరసనకారులు భారీ స్థాయిలో హింస చేశారని.. ఇస్లామాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌కు ఇమ్రాన్‌ఖాన్ అనుచరులు నిప్పు పెట్టారని పేర్కొన్నారు. ఈ నిరసనల్లో పీటీఐ పార్టీకి చెందిన ఫైసల్ అబ్బాస్ చౌదరి బట్టి చౌక్ సమీపంలో వంతెనపై నుండి పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులే అబ్బాస్‌ను వంతెనపై నుంచి తోసేశారని పార్టీ నేత షఫ్కత్ మెహమూద్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇస్లామాబాద్‌లో సైన్యాన్ని మోహరించాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనం వంటి ప్రధాన ప్రభుత్వ సౌకర్యాల వద్ద పాకిస్తాన్ సైన్యం రక్షణగా నిలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..