Pakistan: పాకిస్తాన్ లో వెలుగుచూసిన పోలియో.. 15 నెలల చిన్నారిలో వైరస్

పాకిస్థాన్‌(Pakistan) లోని ఉత్తర వజీరిస్థాన్‌లో పోలీయో కేసు నమోదైంది. 15 నెలల బాలుడిలో టైప్-1 వైల్డ్ పోలియో(Polio) వైరస్ కేసు ఉన్నట్లు ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధికారులు తెలిపారు. దేశంలో ఒక పోలియో...

Pakistan: పాకిస్తాన్ లో వెలుగుచూసిన పోలియో.. 15 నెలల చిన్నారిలో వైరస్
Polio

Updated on: Apr 23, 2022 | 7:14 PM

పాకిస్థాన్‌(Pakistan) లోని ఉత్తర వజీరిస్థాన్‌లో పోలీయో కేసు నమోదైంది. 15 నెలల బాలుడిలో టైప్-1 వైల్డ్ పోలియో(Polio) వైరస్ కేసు ఉన్నట్లు ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధికారులు తెలిపారు. దేశంలో ఒక పోలియో కేసు ఆవిర్భవించడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలియో నిర్మూలన అనేది నిరంతర ప్రయత్నాల ద్వారా సాధ్యమైన గొప్ప విజయం. ఈ పోరాటంలో చాలా మంది పోలియో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నేను పోలియోపై జాతీయ టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పాక్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ అన్నారు. ఉత్తర వజీరిస్థాన్‌ లో 15 నెలల బాలుడు పోలియోకు గురయ్యాడన్న వార్త ఎంతో బాధ కలిగించిందని, దేశంలో పోలియో నిర్మూలన కోసం నేషనల్ ఎమర్జెన్సీ ఏర్పాటు చేసినట్లు సెంటర్ కో-ఆర్డినేటర్ షాజాద్ బేగ్ ట్వీట్ చేశారు. చిన్నారిలో కేసు నమోదవడం ఆ కుటుంబానికి తీవ్ర విషాదకరమైనదని పాకిస్తాన్ ఆరోగ్య కార్యదర్శి అమీర్ అష్రఫ్ ఆవేదన చెందారు. ఉత్తర వజీరిస్థాన్‌లో ఈ ఏడాది పోలియో కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. పాకిస్థాన్ లో చివరగా జనవరి 2021లో పోలియో కేసు నమోదైంది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Gautam Adani: మరో రెండు కీలక రంగాల్లో అదానీ ఎంట్రీ.. ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో ఢీ అంటే ఢీ..