Biden: అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి.. అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..

|

Oct 15, 2022 | 1:14 PM

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్థాన్‌ ప్రపంచంలోనే..

Biden: అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి.. అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..
Joe Biden
Follow us on

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్థాన్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి బైడెన్‌ అభివర్ణించారు.

కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమొక్రాటిక్‌ కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ రిసెప్షన్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, రష్యాలపై కూడా బిడెన్‌ విమర్శనస్త్రాలు సంధించారు. చైనా, రష్యాలకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానం గురించి బైడెన్‌ మాట్లాడుతుండగా పాకిస్థాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నట్లు బైడెన్‌ అన్నారు. రష్యాలో జరుగుతున్న దానిని ఎలా ఎదుర్కోగలం అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికాతో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. 21వ శతాబ్దం రెండో త్రైమాసికంలో పరిస్థితులను మార్చడానికి అమెరికాకు అపారమైన అవకాశాలున్నాయని అన్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహాన్ని విడుదల చేసిన రెండు రోజుల తర్వాత బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ 48 పేజీల డాక్యుమెంట్‌లో పాకిస్థాన్‌కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే బైడెన్‌ అడ్మిస్ట్రేషన్‌ బుధవారం కీలక డ్యాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఇందులో చైనా, రష్యాల నుంచి అమెరికాకు పొంచి ఉన్న ముప్పును ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘నో లిమిట్స్‌ పార్టనర్‌షిప్‌’ను ప్రకటించిన చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని, అయితే అవి విసిరే సవాళ్లు మాత్రం విభిన్నంగా ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా వ్యూహం పేర్కొంది. వచ్చే పదేళ్లు చైనాతో పోటీ నిర్ణయాత్మక దశాబ్దం కానుందని అమరికా భద్రతా వ్యూహం ప్రస్తావించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..