Fuel Prices: చుక్కలనంటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ ఏకంగా రూ.22.20పెరిగింది..!

కొత్త ధరలు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుందని పేర్కొంది.

Fuel Prices: చుక్కలనంటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ ఏకంగా రూ.22.20పెరిగింది..!
Petrol, Diesel Price

Updated on: Feb 16, 2023 | 1:18 PM

పాకిస్తాన్ తీవ్ర ఆర్దిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్‌ నుంచి పాలు, పిండి మొదలు ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌పై ప్రభావం చూపుతోంది. పన్నులతో కూడిన మినీ బడ్జెట్‌ను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ బుధవారం రాత్రి పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.22.20 పెరిగిన తర్వాత రూ.272కి చేరిందని ఆర్థిక శాఖ మీడియా విడుదల చేసింది . డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుందని పేర్కొంది.

డీజిల్, కిరోసిన్ కొత్త ధర..
హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు 17.20 పెరిగి రూ.280కి చేరింది. అలాగే కిరోసిన్ ధరలు లీటరుకు 12.90 పెరిగి రూ.202.73కి చేరాయి. అదేవిధంగా లైట్ డీజిల్ ఆయిల్ ధర రూ.9.68. పెంపుతో లీటరుకు రూ. 196.68 ఉంది. కొత్త ధరలు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి..ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలి మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. తాజాగా ఇంధన ధరలూ భారీగా పెంచడంతో పాక్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

అలాగే కరాచీలో దుకాణదారులు పాల ధరలను లీటరు రూ.190 నుంచి రూ.210కి పెంచారు. లూజ్ మిల్క్, పాకెట్ పాలు అన్నింటి ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. బ్రాయిలర్ చికెన్ గత రెండు రోజుల్లో కిలో రూ.30-40 పెరగడంతో ధర రూ.480-500కి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us