COVID 19: గాలి కాదు.. ఇప్పుడు నీటి ద్వారా విధ్వంసం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. WHO షాకింగ్‌ నివేదిక..!

|

Aug 25, 2023 | 9:38 PM

అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోసారి రెగ్యులర్ అప్‌డేట్‌లను షేర్ చేయడం ప్రారంభించింది. డేటాను అప్‌డేట్ చేయమని అన్ని దేశాలను కోరింది. గత ఒక నెల వరకు ప్రపంచంలోని 11% దేశాలు మాత్రమే డేటాను షేర్‌ చేయగా, ఇప్పుడు 44% దేశాలు డేటాను పంచుకోవడం ప్రారంభించాయి. 234 దేశాలలో 103 దేశాలు డేటాను షేర్‌ చేశాయి. గత నెలలో ప్రతి దేశం నుండి సగటున

COVID 19: గాలి కాదు.. ఇప్పుడు నీటి ద్వారా విధ్వంసం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి..  WHO షాకింగ్‌ నివేదిక..!
Corona Virus
Follow us on

కరోనా మహమ్మారి ప్రారంభంలో ఇది ఎప్పటికీ అంతం కాని వ్యాధిగా వైద్య ఆరోగ్య నిపుణులు చెప్పారు. కరోనా వైరస్ ఎప్పుడూ తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. కాలంతో పాటు బలహీనపడుతుందేమో కానీ, ముగుస్తుందని.. చెప్పడం కష్టమని కూడా నిపుణులు చెప్పారు. నిపుణుల మాటలు ప్రస్తుతం నిజమేనని తేలింది. ఇప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. క‌రోనా వైర‌స్‌తో తీవ్ర జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న రోగులు చ‌నిపోతున్నారు. ఇప్పుడు WHO కరోనా వైరస్ గురించి మరో బిగ్‌ అప్‌డేట్ ఇచ్చింది.

గత ఒక నెలలో కరోనా కొత్త వేరియంట్‌లు 9 విభిన్న సీక్వెన్సులు గుర్తించారు పరిశోధకులు. ఇటీవల WHO ఆగస్టు 17న కరోనా BA.2.86ని గుర్తించింది. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల నుండి ఈ రూపాంతరం 9 విభిన్న రూపాలను కనిపెట్టారు. ఈ వేరియంట్ నుండి ఎటువంటి మరణానికి సంబంధించిన వార్తలు లేనప్పటికీ, థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్‌లో నీటిలో BA.2.86 కోవిడ్ వేరియంట్ గుర్తించబడింది. అయితే, ఈ వేరియంట్‌పై నిపుణులు పూర్తి స్థాయి పరిశీలిన జరుపుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో దీంతో పెద్దగా హాని కలిగించనిదిగా తెలిసింది. కానీ, ఇటువంటి కరోనా రకం, నీటిలో కనిపించిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.

భారత్‌లోనూ కేసులు నమోదవుతున్నాయి ..

ఇవి కూడా చదవండి

ఆసియా దేశాల్లో, థాయ్‌లాండ్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో 1366 కేసులు నమోదయ్యాయి. దీని తరువాత, ఒక నెలలో భారతదేశం నుండి 1335, బంగ్లాదేశ్ నుండి 1188 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనాకు సంబంధించి ఈ వారం భారతదేశంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ప్రధానమంత్రి కార్యాలయం అధ్యక్షత వహించింది. కరోనా వేరియంట్‌లపై నిఘా పెంచడం గురించి చర్చ జరిగింది.

ఈ రెండు రకాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి..

ప్రస్తుతం, XBB.1.16 ఇంకా EG.5 అనే రెండు వేరియంట్‌లు ప్రపంచంలో ఎక్కువగా వ్యాపించాయి. XBB.1.16 మొత్తం 106 దేశాలలో, EG.5 మొత్తం 53 దేశాలలో కనుగొనబడింది. కరోనావైరస్ ఇప్పుడు అంటువ్యాధి కాదు. కానీ, కరోనా కేసు వల్ల కలిగే ఆందోళన ఇప్పటికీ అలాగే ఉంది. దీనితో పాటు కరోనా కొన్ని వైవిధ్యాలు ప్రమాదకరమైన రూపాన్ని తీసుకొని మళ్లీ విధ్వంసం వ్యాప్తి చెందుతుందనే భయం కూడా ఉంది.

ప్రతి దేశం డేటాను షేర్ చేస్తోంది..

అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోసారి రెగ్యులర్ అప్‌డేట్‌లను షేర్ చేయడం ప్రారంభించింది. డేటాను అప్‌డేట్ చేయమని అన్ని దేశాలను కోరింది. గత ఒక నెల వరకు ప్రపంచంలోని 11% దేశాలు మాత్రమే డేటాను షేర్‌ చేయగా, ఇప్పుడు 44% దేశాలు డేటాను పంచుకోవడం ప్రారంభించాయి. 234 దేశాలలో 103 దేశాలు డేటాను షేర్‌ చేశాయి. గత నెలలో ప్రతి దేశం నుండి సగటున ఒక కరోనా కేసు నమోదైంది. అయినప్పటికీ WHO ప్రకారం ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే సగం ప్రపంచం నుండి డేటా రావడం లేదు.

ప్రపంచంలో కరోనా పాజిటివ్‌ రేటు 8శాతం..

అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ప్రపంచంలో కరోనా పాజిటివ్ రేటు 8%. కొరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. 234 దేశాలలో, 49,380 మంది కరోనా రోగులు 27 దేశాల్లోని ఆసుపత్రులలో చేరారు. 22 దేశాల్లో 646 మంది ఐసీయూలో చేరారు. అయితే, గత నెలలో ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్యను కేవలం 12% దేశాలు మాత్రమే నివేదించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..