Kim Jong Un: కొత్త రకం అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. ఆ అధికారులకు కిమ్ మామ కీలక సూచనలు

|

Apr 18, 2022 | 1:27 PM

Kim Jong Un: ఉత్తర కొరియా తమ వ్యూహాత్మక అణ్వాయుధాలను మెరుగుపరచడానికి కొత్త గైడెడ్ ఆయుధ వ్యవస్థను(Guided Missiles) పరీక్షించినట్లు ఆ దేశ మీడియా ఆదివారం తెలిపింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలు అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ధృవీకరిస్తున్నాయి.

Kim Jong Un: కొత్త రకం అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. ఆ అధికారులకు కిమ్ మామ కీలక సూచనలు
Kim Jong Un
Follow us on

Kim Jong Un: ఉత్తర కొరియా తమ వ్యూహాత్మక అణ్వాయుధాలను మెరుగుపరచడానికి కొత్త గైడెడ్ ఆయుధ వ్యవస్థను(Guided Missiles) పరీక్షించినట్లు ఆ దేశ మీడియా ఆదివారం తెలిపింది. న్యూ-టైప్ టాక్టికల్ గైడెడ్ వెపన్.. ఫ్రంట్‌ లైన్ లాంగ్-రేంజ్ ఫిరంగి యూనిట్ల ఫైర్‌ పవర్‌ను మెరుగుపరచడంలో, వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్యమైనదంటూ అక్కడి అధికారిక మీడియా నివేదించింది. తాజాగా చేసిన ఈ పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించింది. అయితే.. అది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో నివేదికలో వెల్లడించలేదు. 2017 తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని(Ballistic Missiles) పేల్చడంతోపాటు ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ఆయుధ పరీక్షల శ్రేణిలో ఈ ప్రయోగం సరికొత్తదిగా నిలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టటం వల్ల వచ్చింది. విన్యాసాలు నార్త్ కొరియాకు చికాకు తీసుకురావటంతో ఈ చర్యలకు దిగిందని తెలుస్తోంది.

ప్రధాన అణు పరీక్షా స్థలంలో కొత్త కార్యాచరణ

వారాంతంలో నార్త్ కొరియా పరీక్షించిన ఆయుధం కొత్త స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా కనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆయుధ పరీక్షల సమయంలో అక్కడే ఉండి వీక్షించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు తాజాగా.. కిమ్ సైనిక పరిశోధన బృందానికి “రక్షణ సామర్థ్యాలు, అణు పోరాట శక్తి మరింత పెంపొందించడంపై ముఖ్యమైన సూచనలు” చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. పుంగ్గే-రి అణు పరీక్షా స్థలంలో టన్నెల్ వద్ద కొత్త అణు కార్యకలాపాలకు సంబంధించిన పునర్నిర్మాణికి వివరాలను తాజా శాటిలైట్ చిత్రాలు  ధృవీకరిస్తున్నాయి. 2018లో అప్పటి అమెరికా ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ మెుదటి సారి కలవటానికి ముందు అక్కడ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ.. తాజాగా గత కొంత కాలంగా కిమ్ దూకుడు పెంచటంతో అక్కడి నుంచి వరుస క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో పనులు వేగంగా సాగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Bank Alert: SBI కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం..

Hindi Jobs: మీకు హిందీ తెలిస్తే చాలు పంట పండినట్లే.. ఆ దేశాల్లో లక్షల్లో జీతాలు..