Plane Crash: డొమినికన్ రిపబ్లిక్‌లో కూప్పకూలిన ప్రైవేట్ విమానం.. ఏడుగురు ప్రయాణికులతో సహా 9మంది మృతి

డొమినికన్ రిపబ్లిక్‌లో ప్రైవేట్ విమానం కూలిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు.

Plane Crash: డొమినికన్ రిపబ్లిక్‌లో కూప్పకూలిన ప్రైవేట్ విమానం.. ఏడుగురు ప్రయాణికులతో సహా 9మంది మృతి
Plane Crash

Updated on: Dec 16, 2021 | 7:44 AM

Dominican Republic Plane Crash: మరో విమానం ప్రమాదానికి గురైంది. బుధవారం డొమినికన్ రిపబ్లిక్‌లో ప్రైవేట్ విమానం కూలిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరియు ఇద్దరు సిబ్బంది మరణించారు. ఏడుగురు ప్రయాణికుల్లో ఆరుగురు విదేశీయులు కాగా, ఒకరు డొమినికన్ అని విమానం ఆపరేటర్ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ ట్వీట్ చేసింది.

విమానం డొమినికన్ రిపబ్లిక్ నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్తుండగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే కుప్పకూలినట్లు విమాన యజమాని హెలిడోసా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also… AP Bus Accident: ఏపీలో మరో బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనంలో మంటలు..