అప్పుడే పుట్టిన ముగ్గురు కవలలకు కరోనా

|

Jun 23, 2020 | 9:55 PM

మెక్సికోలో అప్పుడే జన్మించిన ముగ్గురు కవలలతో పాటు తల్లికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్థారించారు. అయితే ఆ పిల్లలకు కొవిడ్ సోకడంపై వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

అప్పుడే పుట్టిన ముగ్గురు కవలలకు కరోనా
Follow us on

కరోనా వైరస్ అప్సుడే పుట్టిని చిన్నారులను సైతం వదలడంలేదు. మెక్సికోలో అప్పుడే జన్మించిన ముగ్గురు కవలలతో పాటు తల్లికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. అయితే ఆ పిల్లలకు కొవిడ్ సోకడంపై వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

శాన్ లూయిస్ పోటోసి రాష్ట్రంలోని ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమె ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మగవారు కాగా, ఒక ఆడబిడ్డ అని వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉంటే.. ఒక మగ పిల్లవాడు మాత్రం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు తెలిపారు. ముగ్గురు బిడ్డలతో పాటు తల్లికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు.

అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు కొవిడ్ సోకడం అనేది చాలా అరుదైన ఘటన అన్న వైద్యులు పిల్లల కరోనాకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. తల్లి గర్భంతో ఉన్న సమయంలోనే పిల్లలకు వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం తల్లి పిల్లలను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.