Largest Comet: ముప్పు తప్పదా..! భూమి వైపు దూసుకొస్తున్న భారీ తోకచుక్క.. నాసా అలర్ట్..

|

Apr 13, 2022 | 11:35 AM

Nasa - Largest Comet: అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కీలక ప్రకటన చేసింది. భారీ తోకచుక్క నాసా రికార్డులను పటాపంచలు చేసి.. భూమి (Earth) వైపు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది.

Largest Comet: ముప్పు తప్పదా..! భూమి వైపు దూసుకొస్తున్న భారీ తోకచుక్క.. నాసా అలర్ట్..
Largest Comet
Follow us on

Nasa – Largest Comet: అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కీలక ప్రకటన చేసింది. భారీ తోకచుక్క నాసా రికార్డులను పటాపంచలు చేసి.. భూమి (Earth) వైపు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ తోకచుక్క వేగంతో కదులుతున్నట్లు ప్రకటించింది. మంచుతో నిండిన న్యూక్లియస్ తోకచుక్క ఇప్పటివరకు చూడని దానికంటే పెద్దదని పేర్కొంది. దాదాపు 80 మైళ్ల దాకా విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. సాధారణ తోకచుక్కల కంటే ఇది 50 రెట్లు పెద్దది. ఇది దాదాపు 500 ట్రిలియన్ టన్నుల బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడికి దగ్గరగా కనిపించే సాధారణ తోకచుక్క కంటే లక్ష రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. కాగా.. కొంతకాలం క్రితం గుర్తించి శాస్త్రవేత్తలు కామెట్ C/2014 UN271 అని పేరు పెట్టారు. 137 కిలోమీటర్ల పొడవున్న ఈ తోకచుక్కను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి పెడ్రో బెర్నెడినెల్లి .. (Bernardinelli-Bernstein) ఖగోళ శాస్త్రవేత్త గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు. దీంతో దీనిని బెర్నెడినెల్లి-బెర్న్‌స్టెయిన్ (comet Bernardinelli-Bernstein) కామెట్ అని పిలుస్తారు.

కాగా.. ప్రస్తుతం దీని దిశను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది గంటకు 22,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ, సౌర వ్యవస్థ అంచు నుంచి దాని కేంద్రం వైపు కదులుతోంది. అయితే, మనం పూర్తిగా సురక్షితంగా ఉండాలంటూ నాసా పేర్కొంది. తోకచుక్క సూర్యుడు నుంచి ఒక బిలియన్ మైళ్ళ దూరం ఉందని పేర్కొంది. శని గ్రహానికి కూడా అంతేదూరం ఉన్నట్లు పేర్కొంది. ఇది 2031 వరకు జరగదంటూ పేర్కొంది. కాగా.. దీనిని నవంబర్ 2010లో గుర్తించారు. ఆ సమయంలో తోకచుక్క సూర్యుడు, నెప్ట్యూన్‌కు 3 బిలియన్ మైళ్లు దూరం ఉంది. అప్పటి నుంచి పరిశోధకులు అంతరిక్షంలో.. భూమిపై టెలిస్కోప్‌లను ఉపయోగించి దానిపై అధ్యయనాలు చేస్తున్నారు.

Comet

ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కామెట్ పరిమాణాన్ని అంచనా వేయడానికి నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించారు. దీంతో దాని భారీ పరిమాణాన్ని, వేగాన్ని అంచనా వేసి వెల్లడించారు. కామెట్ సూర్యుడి నుంచి చాలా దూరం వద్ద వేగంగా కదులుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కానీ పరిమాణం భారీగా ఉందంటూ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే.. ఈ సంవత్సరం ప్రారంభంలో తీసిన ఐదు ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే, పరిమాణాన్ని కొలవడం ఆ చిత్రాలను తీయడం అంత సులభం కాదు. శాస్త్రవేత్తలు మధ్యలో ఉన్న ఘన కేంద్రం నుంచి తేడాను గమనించి అంచనాలను రూపొందించారు. దీంతోపాటు శాస్త్రవేత్తలు కామెట్ వద్ద న్యూక్లియస్‌ను గుర్తించే ప్రకాశవంతమైన కాంతి చుక్కను కూడా గుర్తించారు. కేంద్రం దగ్గర నుంచి కంప్యూటర్ మోడల్‌ను తయారు చేసి, చిత్రాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు.

కాగా.. ఈ భారీ తోకచుక్క 2014, 2015, 2016, 2017, 2018లో కంటిన్యూగా కనిపించింది. టెలిస్కోప్ ద్వారా వీక్షించినప్పుడు, ఈ తోకచుక్క నీలిరంగు బిందువుగా కనిపించింది, ఇది భూమి వైపు వస్తున్నట్లు కనిపించిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ తోకచుక్క జనవరి 2031న మన సూర్యునికి అత్యంత సమీపంలోకి చేరుకుంటుంది .. ఆ సమయంలో దాని దూరం భూమి నుంచి సూర్యుని దూరం కంటే 11 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read:

Viral Video: సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తాబేలు.. గుక్కెడు నీళ్లు తాగనిస్తే ఒట్టు..!

Weight Loss: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అయితే లావు తగ్గడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు..