South Sudan: మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆఫ్రికాలో వింత వ్యాధి.. 100మంది మృతి..

|

Dec 16, 2021 | 7:25 AM

South Sudan: మనవాళిపై వైరస్‌లు పగబట్టినట్లున్నాయి. రోజుకో రకమైన వైరస్ లు వెలుగులోకి వచ్చి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ వెలుగులోకి..

South Sudan: మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆఫ్రికాలో వింత వ్యాధి.. 100మంది మృతి..
South Sudan
Follow us on

South Sudan: మనవాళిపై వైరస్‌లు పగబట్టినట్లున్నాయి. రోజుకో రకమైన వైరస్ లు వెలుగులోకి వచ్చి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి.. రకరకాల రూపాలను సంతరించుకుని … ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసి.. ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతుండగా.. తాజాగా మరో కొత్త వ్యాధి ఆఫ్రికాను భయపెడుతుంది. వివరాల్లోకి వెళ్తే..

సౌత్ సూడాన్‌లో ఓ మిస్టరీ వ్యాధి అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ మిస్టరీ వ్యాధితో దక్షిణ సూడాన్‌లో దాదాపు 100 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనను ప్రకటించింది. అంతేకాదు అక్కడ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తయారు చేయడానికి వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించడానికి WHO జోంగ్లీ రాష్ట్రానికి తమ  బృందాన్ని పంపింది.

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలకు అక్కడ తీవ్ర వ్యాధులు తలెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అంతేకాదు మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందాయి. ఆహార కొరతను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తాగే నీళ్లు క‌లుషితం అయ్యాయి. దీంతో జోంగ్లీలోని ఫంగ‌క్ అనే న‌గ‌రంలో 100మందికి పైగా మరణించినట్లు సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్  ప్రకటించారు.

మృతికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో వైద్యాధికారులు ఉన్నారు. ఒక్కసారిగా ఇంతమంది మరణానికి గల కారణం గురించి అన్వేషిస్తున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల ఏదైనా భ‌యంక‌ర‌మైన వైర‌స్ సోకిందా? లేక ఇత‌ర వ్యాధి సోకిందా అనే కోణంలో శాస్త్రజ్ఞులు పరిశోధనలు మొదలు పెట్టారు. స్థానిక పరిస్థితి పై అక్కడ పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎంఎస్ఎఫ్ తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేసింది.

దక్షిణ సూడాన్‌లో వరదలు 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. UN ప్రకారం 35,000 మంది నిరాశ్రయులైన వరదల కారణంగా 835,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు.  వరదలు ప్రారంభమైనప్పటి నుండి తీవ్రమైన పోషకాహార లోపంతో ఆసుపత్రిలో చేరిన పిల్లల సంఖ్య రెట్టింపు అయిందని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ మెడెసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ తెలిపింది.

Also Read:   నేడు ఈ రాశి స్త్రీలు చేపట్టిన పనులల్లో సక్సెస్ అందుకుంటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..