Mystery Disease: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ముక్కులోంచి రక్తం కారుతూ ప్రాణాలు కోల్పోతున్న బాధితులు..

|

Feb 11, 2023 | 7:49 AM

అంతుచిక్కని వ్యాధితో ఈక్వటోరియల్ గినియా విలవిలలాడుతోంది. గంటల వ్యవధిలోనే ఎనిమిది మంది మరణించినట్లు ఈక్వటోరియల్ గినియా అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం కారడం..

Mystery Disease: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ముక్కులోంచి రక్తం కారుతూ ప్రాణాలు కోల్పోతున్న బాధితులు..
Equatorial Guinea
Follow us on

అంతుచిక్కని వ్యాధితో ఈక్వటోరియల్ గినియా విలవిలలాడుతోంది. గంటల వ్యవధిలోనే ఎనిమిది మంది మరణించినట్లు ఈక్వటోరియల్ గినియా అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం కారడం.. తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర ప్రమాదకర లక్షణాలతో కొన్ని గంటల్లోనే ప్రజలు మరణిస్తుండటంతో భయాందోళనకు దారితీసింది. రక్తస్రావ జ్వరంతోపాటు.. గుర్తించని అనేకలక్షణాలున్నాయని.. దీనిపై పరిశోధన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈక్వటోరియల్ గినియాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతోపాటు రెండు ప్రభావిత గ్రామాలను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇంకా కామెరూన్ – ఈక్వటోరియల్ గినియా సరిహద్దుల్లో ఆంక్షలు సైతం విధించారు. కాగా.. ఈ అంతుచిక్కని వ్యాధిపై స్థానిక ఆరోగ్య సంస్థలతోపాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) కూడా పరిశోధనలు జరుపుతున్నాయి.

అయితే, ప్రజల మరణానికి గుర్తించని అనేక లక్షణాలు ఉన్నాయని జిల్లా ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి న్‌గు ఫాంకం రోలాండ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈక్వటోరియల్ గినియా కనీసం ఎనిమిది మంది రక్తస్రావ జ్వరంతో మరణించారని.. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కామెరూన్, గాబన్ సరిహద్దులో ఉన్న కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో అంత్యక్రియలకు హాజరైన వ్యక్తులను ఈ వ్యాధి ప్రభావితం చేసిందని, ఈ వ్యాప్తి మంగళవారం మొదటిసారిగా గుర్తించినట్లు సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, అంతుచిక్కని వ్యాధి మరణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్వటోరియల్ గినియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 మరణాలను ధృవీకరించగా.. మరొక అధికారి మరణించిన వారి సంఖ్య 10 అని పేర్కొన్నారు. అయితే, కామెరూన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం 20 వరకు ఉన్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర రుగ్మతలతో కొన్ని గంటల్లోనే మరణించినట్లు ఆరోగ్య విభాగాధిపతి ఎన్‌గు ఫాంకం రోలాండ్ రాయిటర్స్‌తో చెప్పారు.

ప్రయాణ ఆంక్షలతోపాటు రెండు గ్రామాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయని, 200 మందికి పైగా ప్రజలు క్వారైంటైన్లో ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కామెరూన్‌తోపాటు, ప్రభుత్వం సరిహద్దు వెంబడి కదలికలను కూడా నిషేధం విధించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..