US-Canada Heatwave: కెనడా, కాలిఫోర్సియాలో భానుడి భగభగలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం విలవిల

| Edited By: Janardhan Veluru

Jul 12, 2021 | 1:42 PM

పశ్చిమ అమెరికా, కెనడా దేశాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఎండల వేడికి ఈ దేశాల్లో నిన్న కొన్ని రోడ్లను పూర్తిగా మూసివేయగా.. రైళ్ల సర్వీసులను కుదించారు. పరిమితంగా రైళ్లను నడపాలని ఆదేశించారు. ఇది డేంజరస్ హీట్ వేవ్..ఇవి రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్స్

US-Canada Heatwave: కెనడా, కాలిఫోర్సియాలో భానుడి భగభగలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం విలవిల
Millions In Us Canada Hit By Scorching Hot Temperatures
Follow us on

పశ్చిమ అమెరికా, కెనడా దేశాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఎండల వేడికి ఈ దేశాల్లో నిన్న కొన్ని రోడ్లను పూర్తిగా మూసివేయగా.. రైళ్ల సర్వీసులను కుదించారు. పరిమితంగా రైళ్లను నడపాలని ఆదేశించారు. ఇది డేంజరస్ హీట్ వేవ్..ఇవి రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్స్ అని వెదర్ సర్వీసు విభాగం అధికారులు కూడా హడలిపోయారు. తమ వెబ్ సైట్ లో ఇదే విషయాన్ని వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో ఈ నెల 10 న 126 డిగ్రీల ఫారెన్ హీట్, లాస్ వేగాస్ లో 117 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదయ్యాయి. 1942 లోను, తరువాత 2005 అనంతరం మూడు సార్లు మాత్రం ఇంతలేసి టెంపరేచర్స్ రికార్డు అయ్యాయట. పసిఫిక్ బోర్డు నుంచి, రాకీ మౌంటెయిన్స్ (పర్వత ప్రాంతాల) నుంచి వీస్తున్న వేడిగాలులు వడగాడ్పులుగా మారి జనాలను అవస్థల పాల్జేస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో , సిలికాన్ వ్యాలీ, శాన్ జొస్, ఫోనిక్స్ తదితర రాష్ట్రాలు, ప్రాంతాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీస్తున్నాయి.

కాలిఫోర్నియా లోనే గాక కెనడాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అడవుల్లో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కెనడాలోని వాంకోవర్ కి 150 మైళ్ళ దూరంలో గల లింట్ డౌన్ దాదాపు తగులబడింది. ఆ దారిన వెళ్తున్న కార్గో ట్రెయిన్ కి మంటలు అంటుకున్న ఫలితంగా అక్కడి ఇళ్ళు కూడా దగ్ధమైనట్టు భావిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇలా ఎన్నడూ జరగలేదని వారు తెలిపారు. హెలికాఫ్టర్ల ద్వారా కార్చిచ్చును ఆర్పడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఈ ఎండల ధాటి మరికొన్ని రోజులు ఇలాగే ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి  : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021

 బూతులు తిడుతున్నారు..సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు..:Mohan Babu Video.

 వకీల్ సాబ్ అడిగిన లాజిక్ నిజం చేసిన హైదరాబాద్ పోలీసులు..ఒకరి కోసం మరొకరు చేసిన ప్రాణ త్యాగం వృధా అవ్వలేదు:Hyderabad Traffic Police Video.

 బౌండరీ లైన్ వద్ద సూపర్బ్ క్యాచ్ వారేవా హర్లీన్..!వైరల్ అవుతున్న వీడియో..:Harleen’s stunning catch video.