Middle East War: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ గ్యాంబ్లింగ్ ఇంకా ఎన్నాళ్లు?

రెండు రోజుల్లోనే ముగ్గురు కీలక నేతలను పోగొట్టుకున్న ఇరాన్‌.. దిగొస్తుందా? నరమేధం కొనసాగుతుందన్న అమెరికా హెచ్చరికలకు జడుసుకుంటుందా? బుషెహర్‌లో ఉన్న ఇరాన్‌ వన్‌ అండ్ ఓన్లీ న్యూక్లియర్‌ ప్లాంట్‌ని కూడా నాశనం చేస్తామన్న అమెరికా హుంకరింపులు వర్కవుటౌతాయా? ఇవన్నీ అటుంచితే, చచ్చేదాకా కొడతామంటున్న అమెరికా పెత్తందారీ ధోరణి మాత్రం యుద్ధం కొనసాగుతుందన్న క్లారిటీనే ఇస్తోంది. ఇప్పటికే 20 రోజులైంది మధ్యప్రాచ్యం మంటెక్కబట్టి. పైగా, నిన్నటినుంచీ డేంజరస్ టర్న్ తీసుకుంది యుద్దం. ఈ జ్వాల చల్లారేదెప్పుడు? ఆలోగా మిగతా దేశాలకు జరుగుతున్న తీవ్రమైన గాయాల సంగతేంటి?

Middle East War: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ గ్యాంబ్లింగ్ ఇంకా ఎన్నాళ్లు?
Donald Trump On Middle East War

Updated on: Mar 19, 2026 | 9:45 PM

‘‘సార్.. మీరు మళ్లీ తప్పు చేస్తున్నారు.. యుద్ధకాముకుడిగా మీ కళ్లు మూసుకుపోయాయి.. పూర్తిగా తగలడకముందే మేలుకోండి..!’’ అంటూ అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌ జో కెంట్‌.. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌నుద్దేశించి రాసిన లేఖలో మొదటి లైన్ ఇది. ఇరాన్‌తో మనకు ముప్పు ఉందని లేనిపోనివి చెప్పి కొందరు గ్లోబల్ లాబీయిస్టులు మిమ్మల్ని నమ్మించారు. గతంలో ఇరాక్‌పై కూడా అమెరికాను రెచ్చగొట్టి ఇలాగే యుద్ధంలోకి లాగారు. గుర్తుందా..? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు అని నెత్తీనోరూ బాదుకున్నాడు మిస్టర్ జో కెంట్. ఉత్తపుణ్యానికే ఇరాన్‌ని ఇలా చితకబాదెయ్యడం నా మనస్సాక్షికి నచ్చడం లేదు. మీ పాపంలో నేను పార్ట్‌నర్‌ని కాలేను.. తప్పుకుంటున్నా అని రాజీనామా రాసి ట్రంప్ మొహాన విసిరేసి వెళ్లాడు. ఎవరా బుద్ధిమంతుడు అని ప్రపంచమంతా కెంట్ వైపు ఆసక్తిగా చూసింది. కానీ, అతడొక పిరికిపంద.. అలాంటి వాళ్ల సాయం నాకు అక్కర్లేదని మోనార్క్‌లా మొండిగా ముందుకే వెళ్తున్నారు అమెరికన్ ప్రెసిడెంట్. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్లేదు మరి. ఒక మొండోడి మెంటల్ ఫలితం ఏంటంటే.. ఇదిగో ఇదీ.. వరల్డ్ వైడ్ డిజాస్టర్. ప్రపంచం మొత్తానికి పొంచివున్న క్రొకొడైల్ ఫెస్టివల్! రాస్‌ లఫన్‌ కాంప్లెక్స్‌… దోహాకి ఉత్తరాన,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి