Guanajuato: వేడుకల్లో కాల్పుల మోత.. 12 మంది మృతి! తీవ్రంగా గాయపడిన 20 మంది..

గువానాజువాటోలోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వేడుక సందర్భంగా దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెక్సికోలోని హింసాత్మక పరిస్థితులకు నిదర్శనం. మెక్సికన్ అధ్యక్షురాలు ఈ దాడిని ఖండించి, దర్యాప్తుకు ఆదేశించారు.

Guanajuato: వేడుకల్లో కాల్పుల మోత.. 12 మంది మృతి! తీవ్రంగా గాయపడిన 20 మంది..
Guanajuato

Updated on: Jun 26, 2025 | 7:43 AM

మెక్సికోలోని గ్వానాజువాటో సిటీలో దుండగులు రెచ్చిపోయారు. కాల్పులతో సంబురాల్లో రక్తం పారించారు. గ్వానాజువాటోలో స్థానికంగా జరుపుకునే సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వేడుకలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ అంటే ఇరాపువాటోలో జరుపుకునే ఒక స్ట్రీట్ సెలబ్రేషన్స్. ఇందులో స్థానికులు మద్యం సేవిస్తూ.. డ్యాన్స్ చేస్తుంటారు. ఈ వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు ఆ ప్రాంతానికి గన్స్‌తో వచ్చి కాల్పులు జరిపారు. కాల్పుల్లో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

కాల్పులు జరిగి గందరగోళం చెలరేగడానికి కొద్దిసేపటి ముందు ఒక గృహ సముదాయంలోని డాబాలో బ్యాండ్ వాయిస్తుండగా ప్రజలు నృత్యం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఇరాపువాటో అధికారి రోడాల్ఫో గ్మెజ్ సెర్వంటెస్ 12 మంది మరణించినట్లు, దాదాపు 20 మంది గాయపడ్డారని ధృవీకరించారు. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న గ్వానాజువాటో చాలా ఏళ్లుగా మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,435 హత్యలు నమోదయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి