Malian Woman: కరోనా తో ప్రస్తుతం ఏ దేశంలోనైనా సరే.. జీవించడానికి ఎన్నో కష్టాలను పడాల్సిన పరిస్థితులున్నాయి. ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోవడానికి పస్తులు లేకుండా బతకడానికి రోజు జీవితంతో పోరాడాల్సిందే.. దీంతో ఇంట్లో ఒకరు, ఇద్దరు పిల్లలు ఉంటేనే.. వీరికి తింటి, బట్టలు, చదువు ఎలా అంటూ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. మెరుగైన సదుపాయాలను అందించడానికి ఎంతో కష్టపడుతున్న తల్లిదండ్రులు ఎందరో… మరి అలాంటికి ఓ దంపతులకు ఒకే కాన్పులో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది పిల్లలు పుడితే.. ఆ పిల్లలు ఎలా ఉన్నారు.. వారిని ఎలా పెంచుతున్నారు అనే ఆలోచన ఆ పిల్లలు గుర్తుకొచ్చినప్పుడల్లా వస్తుంది.. 2021 మే నెలలో పుట్టిన తొమ్మిది మంది పిల్లల గురించి.. వారి పెంపకం గురించి ఇటీవల తల్లిదండ్రులు మీడియాతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మాలి కి చెందిన 26 ఏళ్ల హలీమా సిస్సే కు ఫస్ట్ ఒక కూతురు ఉంది. రెండో సారి గర్భం దాల్చింది. అయితే వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళిన సమయంలో హలీమా సిస్సే గర్భంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉండవచ్చని చెప్పారు. ఇక నెలలు నిండే కొద్దీ పొట్ట భారీగా పెరగడం మొదలైంది. దీంతో వైద్యులు హలీమా సిస్సే ని పరీక్షించి మీకు ఏడుగురు పిల్లలు పుట్టబోతున్నారని చెప్పారు. దీంతో డెలివరీ కోసం హలీమా సిస్సే తన భర్తతో కలిసి మాలి నుంచి మొరాకో దేశానికి వచ్చారు. ఈ ఏడాది మే లో మొరాకోలోని ఓ ఆస్పత్రిలో హమలీకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. అయితే వైద్యులు పొట్టలో నుంచి పిల్లలను బయటకు తీసేకొద్దీ వస్తూనే ఉన్నారు. ఏడుగురు అనుకున్న పిల్లల్లు చివరికి తొమ్మిదిగా తేలింది. తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది హలీమా. వీరిలో నలుగురు అబ్బాయిలు. ఐదుగురు అమ్మాయిలు. అయితే నెలలు నిండకుండానే భూమి మీద పడిన ఈ పిల్లలను నెల రోజుల పాటు ఇంక్యుబులేటర్లోనే ఉంచారు.
నెలరోజుల అనంతరం ఈ చిన్నారులు తల్లిదండ్రులైన కాదర్ , హలీమాల ఒడికి చేరుకున్నారు. అయితే పిల్లలు ఎక్కువమంది పుట్టడంతో… వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆస్పత్రి సమీపంలోనే ఈ దంపతులు ఓ ఇల్లుని అద్దెకు తీసుకున్నారు. ఒక పాప, తొమ్మిది మంది చిన్నారులను చూసుకోవడానికి ఈ దంపతులకు కష్టం అవుతుంటే.. ఆస్పత్రి దగ్గరలోనే ఉండడంతో.. ఆస్పత్రి సిబ్బంది ఈ దంపతులకు సాయం చేస్తున్నారు. పిల్లల పనులు చేస్తూ అండగా నిలబడుతున్నారని హలీమా దంపతులు చెప్పారు. ఇక తొమ్మిది మంది పిల్లలకు రోజుకు ఆరు లీటర్ల పాలు కావాల్సి ఉంటుందని.. ఇక డైపర్స్ కూడా 100 డైపర్లు కావాల్సి వస్తుందని చెబుతున్నది హలీమా. పిల్లలకు అయ్యే పాలు, డైపర్లు, సహా ఇతర ఖర్చులకు భరించడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉందని చెపింది. ఇంత ఖర్చు భరించడం తమ వల్లకవడం లేదని.. చాలా కష్టంగానే ఉన్నట్టు చెబుతోంది. డెలివరీ కోసం.. పిల్లల్ని ఇంక్యుబులేటర్లో ఉంచినందుకు ఆసుపత్రి బిల్లే సుమారు పదిన్నర కోట్ల రూపాయలు (మనదేశ కరెన్సీ) వరకూ అయ్యి ఉంటుందని చెప్పారు. అయితే తన డెలివరీ, పిల్లల వైద్యానికి అయ్యే ఖర్చుని ఎక్కువ శాతం మాలి ప్రభుత్వమే భరించిందని తెలిపింది. ఇక పిల్లలు సాధారణ బరువుకు చేరుకుని, ఆరోగ్యంగా తయారయ్యాక తిరిగి మాలీకి వెళ్లిపోతామని చెబుతున్నారు ఈ దంపతులు. అబ్బాయిలకు ఒమర్, ఎల్హద్జీ, బాహ్, మొహమ్మద్ VI అని పేరు పెట్టారు, అమ్మాయిలకు అడామా, ఒమౌ, హవా, కడిడియా, ఫాతౌమ అని పేరు పెట్టారు.
ఒకే కాన్సులో కవలలు పుడితేనే చూసుకోవడం కష్టంగా భావించే ఈ రోజుల్లో ఏకంగా తొమ్మిది మంది పిల్లలను ప్రసవించడంతో తొమ్మిది మంది పిల్లలను ఈ దంపతులు ఎలా పెంచుతున్నారు అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మాలి లో ఈ దంపతులకు ౩ గదుల ఇల్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. భార్య భర్తలు, ముందు ఒక పాప, ఇప్పుడు తొమ్మిది మంది.. ఇలా మొత్తం 12 మంది తమకున్న చిన్న ఇంట్లో గడపం అంటే చాలా కష్టమని చేబుంది. మాలీ తిరిగి వెళ్ళిన అనంతరం అప్పుడు ఓ పెద్ద ఇల్లు తీసుకొంతమాన్ని చెప్పారు. పిల్లలు, ఆహారం, చదువు వంటి సవరాలు తీర్చడానికి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయని వాపోతున్రునారు . తమ పిల్లల ఆకలిని తీర్చానికి మాలి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుకుంటున్నామని చెప్పారు ఈ దంపతులు. ప్రస్తుతం మొదటి పుట్టిన రెండున్నరేళ్ల కూతురిని ఆమెను కుటుంబసభ్యులు చూసుకుంటున్నారు.
Also Read: మన్యంలో పర్యాటకుల సందడి.. వంజంగి కొండపై మంచు అందాలు పర్యాటకులకు కనువిందు..