Kim Jong Un’s Wife Missing: ఏడాది కాలంగా కనిపించని కిమ్ భార్య సోల్ జు, ఎక్కడికి వెళ్లినట్టు ? ఎన్నో ఊహాగానాలు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు ఏడాదికాలంగా కనిపించడం లేదు. ఆమె అదృశ్యం వెనుక  సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి

Kim Jong Uns Wife Missing: ఏడాది కాలంగా కనిపించని కిమ్ భార్య సోల్ జు, ఎక్కడికి వెళ్లినట్టు ? ఎన్నో ఊహాగానాలు.

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 02, 2021 | 4:09 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు ఏడాదికాలంగా కనిపించడం లేదు. ఆమె అదృశ్యం వెనుక  సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ కారణంగా తన పిల్లలతో బాటు ఆమె అజ్ఞాతం లోకి వెళ్లిందని ఒకరంటే..కాదు..కాదు.. ఆమె భర్త కిమ్ ఉన్  జాంగే ఆమెను కనబడకుండా చేశాడని మరొకరు అంటున్నారు. కరోనా వైరస్ కి భయపడి ఆమె తనకు తానుగా ఐసొలేట్ అయిందని, కొందరు, పబ్లిక్ ఈవెంట్స లో పాల్గొనడంవల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని భయపడి ఎక్కడో తలదాచుకుందని మరికొందరు అంటున్నారు. నార్త్ కొరియన్ రీసెర్చ్ డివిజన్ డైరెక్టర్ హాంగ్ మిన్ ఇదే విషయాన్ని చెబుతున్నారు. చివరిసారిగా ఆమె గత ఏడాది చంద్ర మాసోత్సవం సందర్భంగా జనవరిలో తన భర్తతో కలిసి ఓ థియేటర్ లో దర్శనమిచ్చిందని మరికొంతమంది అంటున్నారు. అస్వస్థతగా ఉన్న కిమ్ సమీప బంధువు క్యూన్గ్ హీ కి సపర్యలు చేసేందుకు సోల్ జు వెళ్లిందని, అలా కాదు, తానే అస్వస్థతకు గురి కావడం వల్ల ప్రజలకు కనిపించడం లేదని కూడా మరికొందరు అంటున్నారు.

2009 లో కిమ్ ఈమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే 2012 లో స్టేట్ మీడియాకు తన భార్యగా ఆమెను పరిచయం చేశాడు. నిజానికి కిమ్ కూడా ఇటీవలి కాలంలో చాలాకొద్ధి సార్లు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. ఏమైనా.. ఏడాది కాలంగా ఈయన భార్య మిస్సింగ్ మాత్రం మిస్టరీయే !