Johnson & Johnson vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వాక్సిన్ వినియోగాన్ని అగ్రరాజ్యం అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. వాక్సిన్ తీసుకున్న కొందరిలో ప్లేట్లెట్స్ తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టినట్టు గుర్తించిన అమెరికా ఈ మేరకు అత్యవసర చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే 6.8 మిలియన్ డోసులను అమెరికా తన పౌరులకు పంపిణీ చేసింది. అటు, అమెరికాతోపాటు, సౌతాఫ్రికా, యూరోపియన్ యూనియన్ కూడా జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో యురోపియన్ దేశాల్లోనూ చోటుచేసుకున్న దుష్ప్రభావాలపై యూఎస్ కి చెందిన సీడీసీ, ఎఫ్డీఏ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇలాఉండగా, కరోనా మహమ్మారిని తరిమేయడానికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని అమెరికా చేపట్టింది. ఈ వ్యాక్సిన్ కారణంగా అరుదైన.. తీవ్రమైన రక్తంగడ్డ కట్టే సమస్య ఎదురవడం, అమెరికాలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఆరుగురిలో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌పై మంగళవారం ప్రకటన విడుదల చేశామని, ముందు జాగ్రత్త చర్యగా ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపేయాలని సిఫార్సు చేస్తున్నట్లు అమెరికా డ్రగ్ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ట్వీట్ చేసింది.
మరోవైపు, వ్యాక్సిన్ తీసుకుని అరుదైన.. తీవ్రమైన రక్తం గడ్డ కట్టిన సమస్యతో బాధపడుతున్న ఆరుగురి డేటాను పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఈ తీవ్ర సమస్యలు చాలా అరుదుగానే కనిపిస్తున్నట్లు అమెరికా డ్రగ్ నియంత్రణ సంస్థ పేర్కొంది.
Today FDA and @CDCgov issued a statement regarding the Johnson & Johnson #COVID19 vaccine. We are recommending a pause in the use of this vaccine out of an abundance of caution.
— U.S. FDA (@US_FDA) April 13, 2021