మాజీ అధ్యక్షుడు బైడెన్ భార్య జిల్ ఇంత కౄరురాలా? ఏకి పారేస్తున్న నెటిజన్లు.. ‘ట్రంప్ అనుమానమే నిజమైందిగా..’

బైడెన్‌ అనారోగ్య విషయం ఆయన సతీమని జిల్‌ బైడెన్‌కు ముందే తెలుసునని, అయినప్పటికీ కావాలనే బైడెన్‌ అనారోగ్యం గురించి బహిరంగంగా తెలిసేలా ఆయనను పలుమార్లు మీడియా ముందుకు  బలవంతం తీసుకువచ్చి, ఆయన అవమాన పడేలా చేసిందని.. ఆమెపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత జిల్‌ బైడెన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై వృద్ధుల వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు...

మాజీ అధ్యక్షుడు బైడెన్ భార్య జిల్ ఇంత కౄరురాలా? ఏకి పారేస్తున్న నెటిజన్లు.. ట్రంప్ అనుమానమే నిజమైందిగా..
Former US President Joe Biden and his wife Jill Biden

Updated on: May 19, 2025 | 11:59 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారనైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు తీవ్ర దిగ్ర్భాంతికి గువుతున్నారు. అయితే బైడెన్‌ అనారోగ్య విషయం ఆయన సతీమని జిల్‌ బైడెన్‌కు ముందే తెలుసునని, అయినప్పటికీ కావాలనే బైడెన్‌ అనారోగ్యం గురించి బహిరంగంగా తెలిసేలా ఆయనను పలుమార్లు మీడియా ముందుకు  బలవంతం తీసుకువచ్చి, ఆయన అవమాన పడేలా చేసిందని.. ఆమెపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత జిల్‌ బైడెన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై వృద్ధుల వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రపంచ వేధికపై ట్రంప్‌ అనుమానం..? అదే నిజమేమో..?

ఈ విషయంపై అధ్యక్షుడు ట్రంప్‌ కూడా డాక్టర్‌ జిల్‌ను ప్రశ్నించారు. బైడెన్‌లో క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించడంలో ఎలా విఫలమైందనే విషయాన్ని ఆరా తీశారు. నిజానికి ‘ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ప్రారంభ దశలో.. అది బోన్‌ మెటాస్టేసెస్‌గా సులభంగా పురోగతి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. PSA బ్లడ్‌ టెస్ట్‌ ద్వారా ఈ క్యాన్సర్ కణాల పెరుగుదల రేటును సులువుగా గుర్తించవచ్చు. అది మెటాస్టాటిక్‌గా మారడానికి ముందు (చికిత్స తీసుకోకుంటే) 5-7 యేళ్ల గడువు ఉంటుంది. అంటే మే 2025లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ మొదటిసారిగా నిర్ధారణ అయిందంటే ఈ వ్యాధి లక్షణాలు ఐదారేళ్ల ముందే బయటపడి ఉండాలి. బైడెన్‌ వైట్‌ హౌస్‌లో అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీకాలంలో ఉన్నంత కాలం ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, కానీ ఈ విషయం అమెరికన్లకు తెలియదని’ ఓ వైద్యుడు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ పోస్టును ట్రప్‌ తిరిగి తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెడుతూ ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. అందులో ట్రంప్‌.. ‘నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే.. జిల్ బైడెన్ ఐదవ దశలో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించడంలో ఎలా విఫలం అయ్యారు..? ఇదిమరో రకం కప్పిపుచ్చుడా???’ అని అనుమానం వ్యక్తం చేశారు.

బైడెన్‌ పాలనా కాలంలో ఆయన అనారోగ్యం దాచిపెట్టే ప్రయత్నం చేశారంటూ వస్తున్న ఆరోపణలపై వైట్‌హౌస్‌ ఉద్యోగి లారోసా స్పందిస్తూ.. ‘ నేను (లారోసా) 2021 నుంచి 2022 వరకు మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ప్రెస్ సెక్రటరీగా పనిచేశాను. కానీ వైట్ హౌస్‌లోని ఒక సమూహానికి పారదర్శకత అంటే అలర్జీ. వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే అషర్‌ను తొలగించారు. ఎవరూ నాకు సమాధానం చెప్పలేదు. నేను చెప్పేది ఏమిటంటే.. దేని గురించి అయినా పారదర్శకంగా ఉండటం వారి శైలి కాదు. వారు ఉద్దేశపూర్వకంగా ఆలోచించడానికి రోజులు, నెలలు పట్టింది. కనీసం కుక్కకాటు వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా తెలిసేది కాదు (బైడెన్‌ ఫ్యామిలీకి చెందిన కుక్క వైట్‌ హౌస్‌లో చాలా మందిని కరిచింది). ఆయన మనవరాళ్ల పెళ్లి కూడా అంతే. అయితే ప్రెస్ కవరేజ్‌ గురించి అబద్ధం చెబుతూ పట్టుబడ్డారు. ఇలా దేని గురించి కూడా అన్ని నిజాలను దాచేస్తారు. చిన్న చిన్న విషయాలనే బహిర్గతం చేయడం వీరికి కష్టంగా ఉంటే.. ఏదైనా పెద్ద విషయమైతే ఎలా బయటకు వస్తుందో? అని అప్పుడు నేను అనుకున్నాను’ అంటూ వైట్‌హౌస్‌లో బైడెన్‌ కుటుంబ సభ్యుల తీరు గురించి లారోసా తెలిపారు.

బైడెన్‌ భార్య జిల్‌ను.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

ఇక బైడెన్‌ భార్య జిల్‌ను నెటిజన్లు ఓ రెంజ్‌లో ఏకిపారేస్తున్నారు. వృత్తి రిత్యా జిల్ కూడా ఓ వైద్యురాలు. భర్త ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంటే గుర్తించలేదంటూ సింపుల్ గా ఎలా చెప్పగల్గుతుంది అంటూ సర్వత్రా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్‌ ఓ దెయ్యం.. బైడెన్‌కు మతిమరుపు ఉందని, క్యాన్సర్ ఉందని తెలిసి కూడా ఆమె అతన్ని బయటకు పంపింది. మీ జీవిత భాగస్వామికి ఇలా చేయడం మీరు ఊహించుకోండి? ఏడాది క్రితం జిల్ బైడెన్‌కు తన భర్తకు లేట్ స్టేజ్ డిమెన్షియా ఉందని తెలుసుకోడమే కాకుండా, అతను క్యాన్సర్‌తో మరణిస్తాడని కూడా ఆమెకు తెలుసు. అందుకే బైడెన్‌ తన తదుపరి జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి రెండోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయకుండా అడ్డుపడిందని మరొకరు ట్వీట్‌ చేశారు. జో బైడెన్ క్యాన్సర్ నిర్ధారణను డాక్టర్ అయిన జిల్ బైడెన్ ఎందుకు గుర్తించలేదు? అంటూ ప్రతి ఒక్కరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్ బిడెన్ ప్రేమగల భార్య కాదు. ఆమె అధికార దాహం గలది.

ఏ మంచి భార్య అయినా మతిమరుపు ఉన్న భర్త, ప్రోస్టేట్ క్యాన్సర్‌తో ప్రాణాలతో పోరాడుతున్న భర్తను మీడియా ముందుకు పంపదు. అతను అందరి ముందు అవమానం పొందకుండా కాపాడుతుంది. కానీ జిల్ అలా కాదు. ఆమె అతన్ని కావాలని కెమెరాల ముందు నిలబెట్టేది. అస్పష్టమైన ప్రసంగాలు, గందరగోళ జనసమూహాల ముందుకు నెట్టివేసింది. ఇవన్నీ ఆమె ఫస్ట్ లేడీగా నటించడానికి వీలుగా ఉన్నాయి. అది ప్రేమ కాదు. అది స్వచ్ఛమైన స్వార్థం. జిల్ బిడెన్ ‘వైఫ్ ఆఫ్ ది ఇయర్’ కాదు. ఆమె ఆ బిరుదుకు అర్హురాలు కాదు. ఆమె నిజమైన డాక్టర్ కూడా కాదు.. అంటూ సోషల్ మీడియా వేధికగా పలువురు జిల్ బైడెన్ కౄరత్వాన్ని అసహ్యించుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.