జేడీ వాన్స్ ఫ్యామిలీలో కన్‌వర్షన్ చిచ్చు.. మతం మార్చుకునేలా వాన్స్ భార్య ఉషపై ఒత్తిడి!

మతమార్పిడి.. కొత్త విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగేదే..! కాకపోతే, గుట్టుచప్పుడు కాకుండా చాటుమాటుగా జరిగే తంతు. కానీ, ఇదిప్పుడు గ్లోబల్ టాపిక్‌గా మారింది. ఒక దేశ ఉపాధ్యక్షుడే మత మార్పిడి గురించి మాట్లాడ్డం, అదీ తన భార్య మతంపై తన అభిమతాన్ని చెప్పడం.. కాంట్రవర్సీ కాకుండా ఎందుకుంటుంది?

జేడీ వాన్స్ ఫ్యామిలీలో కన్‌వర్షన్ చిచ్చు.. మతం మార్చుకునేలా వాన్స్ భార్య ఉషపై ఒత్తిడి!
Jd Vance, Usha Chilkuri

Updated on: Oct 31, 2025 | 10:47 PM

మతమార్పిడి.. కొత్త విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగేదే..! కాకపోతే, గుట్టుచప్పుడు కాకుండా చాటుమాటుగా జరిగే తంతు. కానీ, ఇదిప్పుడు గ్లోబల్ టాపిక్‌గా మారింది. ఒక దేశ ఉపాధ్యక్షుడే మత మార్పిడి గురించి మాట్లాడ్డం, అదీ తన భార్య మతంపై తన అభిమతాన్ని చెప్పడం.. కాంట్రవర్సీ కాకుండా ఎందుకుంటుంది?

గోదావరమ్మాయి.. అమెరికా అబ్బాయి..! అమెరికాలో ప్రభుత్వం మారి, ట్రంప్ జమానా రిపీటై వైస్‌ ప్రెసిడెంట్ కుర్చీలో జేడీ వాన్స్ కూర్చోగానే మన దేశమంతా ఇదే జాతర. మన ఉషా చిలుకూరి భర్త అమెరికా ఉపాధ్యక్షుడయ్యాడని, ఆంధ్రా అల్లుడు మన దేశానికే గర్వకారణంగా నిలబడతాడని అంతటా అదో రకం సందడి. దాదాపు ఏడాది గడుస్తోంది. ఇటీవలే ఉష అండ్ వాన్స్ ఇద్దరూ భారతదేశానికి వచ్చి మన ఆగ్రా వగైరాలన్నీ తిరిగి, మన ఆతిథ్యాన్ని తీసుకున్నారు. మాంచి ట్రెడిషనల్‌గా కనిపించారు. కట్‌చేస్తే.. వాన్స్ నోట వినకూడని మాట.

తన భార్యను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి లాగేస్తున్నానన్న వాన్స్ వాయిస్.. వరల్డ్‌వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎఫైరే కావొచ్చు.. మతం సౌండ్ వచ్చింది కనుక ఇది పబ్లిక్ ఇష్యూగా మారింది. ఆక్స్‌ఫర్డ్‌లో నిర్వహించిన “This is the Turning Point” అనే కార్యక్రమంలో ఇలా సెలవిచ్చిన JD వాన్స్‌ తీరును అందరూ ప్రశ్నిస్తున్నారు. ఒక మతం తక్కువ, మరో మతం ఎక్కువ అని మీ పిల్లలకు ఎలా చెబుతారు? మీ భార్యను మీ మతంతో ఎలా ప్రభావితం చేస్తారు? అని అక్కడికక్కడే నిలదీసిందో యువతి.

నిజానికి వాన్స్ యూదు మతస్థుడు. తర్వాత క్రైస్తవంలోకి మారారు. హిందువైన ఉషా చిలుకూరిని ఇష్టపడి పెళ్లి చేసుకుని, పదేళ్లు హిందువుగానే కొనసాగించారు. ఇప్పుడు సడన్‌గా క్రిస్టియానిటీలోకి వెల్‌కమ్ చెప్పడం ఏంటి? ఆయన ప్రపోజల్‌కి ఆమె ఏమంటారు? అనే చర్చ జరుగుతుండగానే, వీళ్ల వైవాహిక జీవితంలోకి తొంగిచూస్తూ ఫ్లాష్‌బ్యాక్‌ తవ్వి తీస్తున్నారు నెటిజన్లు. అదే వేదికపై ఎరికా కిర్క్ అనే ఆవిడకు జేడీ వాన్స్ ఇచ్చిన కౌగిలింత వీడియో కూడా వైరల్ ఔతోంది.

తన మాజీ మొగుడిని జేడీ వాన్స్‌లో చూసుకుంటానన్న ఆమె కాంప్లిమెంట్‌ కూడా ట్రెండవుతోంది. మతమార్పిడి వ్యవహారం ముదిరి.. వాన్స్ అండ్ ఉష విడాకులు తీసుకున్నా ఆశ్చర్యం లేదనేదాకా వెళ్లింది వాళ్ల మీద ట్రోలింగ్..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..