Sri Lanka Crisis: శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే అక్కడి పౌరులు సతమవుతున్నారు. ఇదే సమయంలో వారికి మరిన్ని కష్టాలు మెుదలయ్యాయి. ఆ దేశం అనుకోను ఆర్థిక సంక్షోభం(Financial Crisis).. ఎదుర్కోవటం వల్ల మందులు, శస్త్రచికిత్సలకు వినియోగించే పరికరాల కొరత ఏర్పడింది. ఇందువల్ల.. సెంట్రల్ జిల్లా కాండీలోని ప్రఖ్యాత పెరిడినియా ఆసుపత్రి శస్త్రచికిత్సలను(Surgeries) నిలిపివేస్తున్నట్లు సోమవారం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. కీలకమైన మందుల కొరత కారణంగా శ్రీలంకలో వైద్య సేవలు నిలిపివేయటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.
Scheduled surgeries at the Peradeniya Hospital were suspended due to a shortage of medicines. Only emergency surgeries are taking place – NewsFirst #LKA #SriLanka #EconomicCrisisLK
— Sri Lanka Tweet ?? ? (@SriLankaTweet) March 29, 2022
దీనిపై మానవతా సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. ఈ వార్త చూసి తన మనసు కలచివేసిందని అన్నారు. వెంటనే భారత్ తరఫున తగిన సహాయం ఆ ఆసుపత్రికి అందేలా చూడాలని కొలంబోలోని భారత హై కమిషనర్ కు జైశంకర్ సూచించారు. ఈ విషయంలో భారత్ ఎటువంటి సహకారం అందించగలదో సదరు ఆసుపత్రితో చర్చించాలని ఆదేశించారు. శ్రీలంకలోని భారత ప్రతినిధి ఈ మేరకు ఆసుపత్రి వర్గాలను కలిసి శస్త్రచికిత్సలను కొనసాగించటానికి అవసరమైన మందుల గురించి అడిచి తెలుసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. ద్వీపకల్ప దేశానికి భారతదేశం ఎలా సహాయపడుతుందనే దానిపై ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఇతరులతో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి జైశంకర్ శ్రీలంక పర్యటన జరిపిన సందర్భంలో ఈ విషయం చోటుచేసుకుంది.
Disturbed to see this news. Am asking High Commissioner Baglay to contact and discuss how India can help.@IndiainSL #NeighbourhoodFirst https://t.co/jtHlGwxCBL
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 29, 2022
ఇవీ చదవండి..
Electric Bikes: వాహనదారులను కలవరపెడుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు.. ఆ రెండు ఘటనలపై దర్యాప్తు..!